Beauty Tips

Banana Face Pack: అరటిపండుతో ఇలా చేస్తే.. పట్టులాంటి మెరిసే చర్మం మీ సొంతం..

Banana Face Pack: అరటిపండుతో ఇలా చేస్తే.. పట్టులాంటి మెరిసే చర్మం మీ సొంతం.. ఎవరు మాత్రం తమ ముఖం ఎల్లప్పుడూ తాజాగా, మెరిసేలా ఉండాలని కోరుకోరు? కానీ, ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖంపై మొటిమలు, మచ్చలు రావడం వల్ల అందం తగ్గినట్లు కనిపిస్తుంది.

వీటిని తగ్గించేందుకు అమ్మాయిలు పడే ఆరాటం చిన్నది కాదు. పార్లర్‌లకు వెళ్లడం, ఖరీదైన ఫేస్ క్రీములపై వేలకు వేలు ఖర్చు చేయడం చేస్తారు, కానీ తరచూ ఫలితం కనిపించదు. అయితే, అరటిపండుతో ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నించండి—మీ చర్మం పట్టులా మృదువుగా మారుతుంది!

అరటిపండు ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు చర్మ రక్షణకు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అరటిపండుతో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.

అరటిపండు తొక్కలతో…
అరటిపండు తిన్న తర్వాత తొక్కలను పారేస్తున్నారా? ఇకపై అలా చేయవద్దు! అరటిపండు తొక్కల్లో కూడా చర్మ సౌందర్య గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కళ్ల కింద నల్లటి వలయాలపై తొక్కతో కాసేపు మసాజ్ చేసి, పావుగంట పాటు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. రోజూ వీలైనప్పుడల్లా ఇలా చేస్తే, వారం రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.

అరటిపండు, ఓట్స్ పొడి ఫేస్ ప్యాక్
బాగా పండిన అరటిపండు గుజ్జును ఒక చిన్న గిన్నెలో తీసుకుని, అందులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పొడి లేదా పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. రెండు రోజులకోసారి ఈ విధంగా చేస్తే, మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం అందంగా మెరుస్తుంది.

అరటిపండు, తేనె ఫేస్ ప్యాక్
ఒక చిన్న గిన్నెలో బాగా పండిన అరటిపండు గుజ్జును తీసుకుని, రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. రోజు మార్చి రోజు ఇలా చేస్తే, ముఖం మృదువుగా, తాజాగా, మెరిసేలా కనిపిస్తుంది.

అరటిపండు, నిమ్మరసం ఫేస్ ప్యాక్
ఒక గిన్నెలో అరటిపండు గుజ్జును తీసుకుని, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే, ముఖంపై అదనపు నూనె తగ్గడమే కాక, మొటిమలు కూడా తొలగిపోతాయి.

అరటిపండు, పసుపు ఫేస్ ప్యాక్
బాగా పండిన అరటిపండు గుజ్జును ఒక గిన్నెలో తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ పసుపు కలిపి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే, ముఖంపై నలుపుదనం తగ్గి, చర్మం కాంతివంతంగా, తాజాగా మెరుస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ