DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో..

మేషం
ప్రారంభించిన పనులను సహచరుల సహాయంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు. మీ తెలివితేటలతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. శ్రీ గణపతి ఆరాధన శుభకరం.

వృషభం
కొత్త పనులు ప్రారంభించేటప్పుడు సమయానుగుణంగా ముందుకు సాగితే శుభం కలుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను నియంత్రించండి. దైవశక్తి పెరుగుతుంది. హనుమాన్ ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

మిథునం
మీ రంగంలో అతిగా జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహించండి. సహచరుల సలహాలను పాటించడం మేలు. వ్యాపారంలో మీ ఆలోచనలను ఇతరులతో చర్చించడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

కర్కాటకం
మధ్యమ ఫలితాలు కనిపిస్తాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఏ పరిస్థితిలోనూ ధైర్యం కోల్పోవద్దు. సహచరుల సహకారంతో మేలు జరుగుతుంది. నవగ్రహ స్తోత్ర పఠనం శుభఫలితాలను అందిస్తుంది.

సింహం
మీ రంగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ధర్మసిద్ధి కలుగుతుంది. ముఖ్య విషయాల్లో స్వంత నిర్ణయాలు ఫలిస్తాయి. ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. శ్రీ విష్ణు దర్శనం శుభకరం.

కన్య
ప్రారంభించిన పనులలో అడ్డంకులు ఎదురైనా, వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఒక వార్త మానసిక అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శివ ఆరాధన మేలు చేస్తుంది.

తుల
ఉత్సాహంగా పనిచేయాలి. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండండి. కొందరు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. చిన్న విషయాలను పెద్దగా చేయకూడదు. దుర్గా ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది.

వృశ్చికం
ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ రంగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనుస్సు
మీ కృషి ఫలిస్తుంది. తెలివితేటలతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా బలంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో పురోగతి సాధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇష్టదైవ ఆరాధన శుభం కలిగిస్తుంది.

మకరం
మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. మీ నిర్ణయాలు సఫలమవుతాయి. ఆనందకరమైన వాతావరణంలో కాలం గడుస్తుంది. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.

కుంభం
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మానసిక సౌఖ్యం ఉంటుంది. ఇష్టదైవ స్తుతి శుభఫలితాలను అందిస్తుంది.

మీనం
శుభ సమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల నుంచి సహాయం అందుతుంది. శ్రీ ఆంజనేయ దర్శనం శుభకరం.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ