AP Annadata Sukhibhava:అన్నదాత సుఖీభవ రావాలంటే ఈ పనిచేయాల్సిందే.. జూన్ 20 చివరి తేదీ..ఆలస్యం చేయకండి..
AP Annadata Sukhibhava:ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతోంది. సూపర్ సిక్స్ హామీలను క్రమంగా అమలు చేస్తూ వస్తున్న ఈ ప్రభుత్వం, కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా తాజాగా ‘తల్లికి వందనం’ పథకం నిధులను విడుదల చేసింది. అలాగే, రైతులకు పెట్టుబడి సాయంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఏడాదికి రూ.20,000 అందించేందుకు సిద్ధమైంది.
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలు చేయనున్నారు. పీఎం కిసాన్ యోజన కింద ఏడాదికి రూ.6,000 అందగా, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 అందజేయనుంది. జూన్ 20న పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేయనున్నారు.
అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి మూడు విడతల్లో రూ.20,000 అందజేస్తారు. తొలి విడతగా జూన్ 20న రూ.7,000 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందులో పీఎం కిసాన్ యోజన కింద రూ.2,000, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5,000 అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.14,000ను మూడు విడతల్లో రూ.5,000, రూ.5,000, రూ.4,000 చొప్పున చెల్లించనుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, తొలి విడతగా జూన్ 20న రూ.7,000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఇదిలా ఉండగా, అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల వివరాలను అధికారులు ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపించారు. ఎంపికైన రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శిస్తున్నారు. అయితే, జూన్ 20న విడుదల చేయనున్న రూ.7,000 సాయం అందాలంటే, రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఈ పథకం లబ్ధిదారులకు ఈ-కేవైసీ అర్హులైన రైతులు సమీప రైతు సేవా కేంద్రంలో ఈ-కేవైసీ పూర్తి చేసుకుంటేనే నిధులు జమ అవుతాయని అధికారులు తెలిపారు.
ఈ-కేవైసీ పూర్తి చేయడానికి జూన్ 20 ఆఖరి తేదీగా నిర్ణయించారు. రైతులు రైతు సేవా కేంద్రాలలో బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్నదాత సుఖీభవ సాయం అందజేస్తామని ప్రభుత్వం పేర్కొంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

