Business

Andhra Pradesh Thalliki Vandanam: తల్లికి వందనం రూ. 13 వేలు రాలేదా.. ఇలా చేయటానికి ఈ నెల 26 వరకే ఛాన్స్..

Andhra Pradesh Thalliki Vandanam: తల్లికి వందనం రూ. 13 వేలు రాలేదా.. ఇలా చేయటానికి ఈ నెల 26 వరకే ఛాన్స్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 13,000 జమ చేసిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా, ఒక్కో విద్యార్థికి రూ. 15,000లో రూ. 13,000 తల్లుల ఖాతాల్లో జమ చేస్తుండగా, మిగిలిన రూ. 2,000 పాఠశాలల నిర్వహణ గ్రాంట్ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో జమ చేస్తున్నారు.

ఒక్కో విద్యార్థికి రూ. 13,000 చొప్పున సాయం అందిస్తుండగా, ఇద్దరు పిల్లలు ఉన్న తల్లులకు రూ. 26,000, ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులకు రూ. 39,000 వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. చాలా మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే నిధులు జమ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, 2 శాతం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు యాక్టివ్‌గా లేకపోవడంతో నిధులు తిరిగి వచ్చాయని, వారు తమ ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఖాతాలు యాక్టివ్ అయిన వెంటనే నిధులు జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తల్లికి వందనం నిధులు జమ అయినట్లు మొబైల్‌కు సందేశాలు కూడా వస్తున్నాయి. అయితే, మీకు అర్హత ఉన్నప్పటికీ డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. అలాగే, గ్రామ/వార్డు సచివాలయాలను సందర్శించి అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. అంతేకాక, ఆన్‌లైన్‌లో లేదా వాట్సాప్ గవర్నెన్స్‌లోని ‘మనమిత్ర’ ద్వారా తల్లికి వందనం స్టేటస్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు.

కొందరు అర్హతలు ఉన్నప్పటికీ తల్లికి వందనం నిధులు రాలేదని ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, అటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూల సమాచారం అందించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం నిధులు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

అర్హత ఉండి నిధులు జమ కాని వారు ఈ నెల 26 వరకు ఫిర్యాదులు చేయవచ్చని, ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా లేదా గ్రామ/వార్డు సచివాలయాలను సంప్రదించి ఫిర్యాదులు నమోదు చేయవచ్చని ఆయన తెలిపారు. డేటాలో ఏవైనా పొరపాట్లు ఉంటే, వాటిని సరిచేసి అర్హులకు నిధులు అందజేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

వాట్సాప్ ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసే విధానం:
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వివిధ పౌర సేవలను అందిస్తోంది. ఇందులో విద్యా సేవలతో పాటు తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసే సౌలభ్యం కూడా ఉంది.

దీని కోసం వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు ‘Hi’ అని సందేశం పంపాలి. అక్కడ ‘సేవను ఎంచుకోండి’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, డ్రాప్‌డౌన్ మెనూ నుంచి ‘తల్లికి వందనం స్టేటస్’ను ఎంచుకోవాలి. ఆ తర్వాత, సూచించిన విధంగా తల్లి ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, ‘నిర్ధారించండి’పై క్లిక్ చేయాలి. ఇలా చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ తెలుసుకోవచ్చు.

గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."