Horoscope Today: 12 రాశుల వారికి రాశిఫలాలు.. ఈ రాశుల వారికీ అదృష్టం కలిసి వస్తుంది
Rasi Phalalu:మనలో చాలా మంది ప్రతి రోజు రాశి ఫలాలు చూసుకుంటూ ఉంటారు. కొంత మంది జాతకాలను నమ్మరు. కొంతమంది నమ్ముతారు. ఈ ఆర్టికల్ జాతకాలను నమ్మేవారి కోసం మాత్రమే.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
నీవు ప్లాన్ చేసిన పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారం, వృత్తిలో లాభాలు సమృద్ధిగా ఉంటాయి. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఇంటి కొనుగోలు, వాహనం కొనుగోలు వంటి ప్రయత్నాలపై దృష్టి సారిస్తావు. పిల్లలు బాగా పురోగమిస్తారు. కుటుంబ జీవనం సంతోషకరంగా సాగుతుంది. విద్యార్థులు చదువులో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగ రంగంలో కొంత పురోగతి సాధిస్తావు. సహోద్యోగులతో అపార్థాలు తొలగిపోతాయి. వ్యాపారంలో కృషి ఎక్కువైనప్పటికీ, ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆదాయం బాగున్నప్పటికీ, అనవసర ఖర్చులు, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశం లభిస్తుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో నీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటావు. వ్యాపారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి, ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి. కుటుంబ జీవనం సామరస్యంగా సాగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు చదువులో పురోగమిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
కొన్ని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారం స్థిరంగా సాగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ ఒత్తిడి ఉండవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. విద్యార్థులు కష్టపడి చదవాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతోషకరంగా సాగుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో కీలక మార్పులు జరుగుతాయి. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు తగ్గుతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంటా బయటా కొంత ఒత్తిడి ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ భాగస్వామితో సన్నిహితం పెరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితంలో మార్పులు సంభవించవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం కొంత పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. వదిలేసిన డబ్బు తిరిగి చేతికి వస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆస్తి వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తావు. నిరుద్యోగులకు స్వస్థలంలో ఉద్యోగం లభించవచ్చు. విద్యార్థులకు కొంత కష్టం తప్పదు. ప్రేమ వ్యవహారాలు సంతోషకరంగా సాగుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి జీవితంలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటావు. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. విద్యార్థులు చదువులో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభవార్తలు వింటావు. వృత్తి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఆదాయం బహుముఖంగా పెరుగుతుంది. ఆదాయం సమృద్ధిగా ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం అనుకోకుండా పరిష్కారమవుతుంది. విద్యార్థులు కొంత శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చిన్న చికాకులు ఉండవచ్చు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో నీ ప్రాధాన్యం పెరుగుతుంది. జీతం, భత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్త వింటావు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఏ పని చేపట్టినా విజయవంతమవుతుంది. ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి సంబంధం పరిచయస్థుల ద్వారా కుదురుతుంది. విద్యార్థులు సులభంగా పురోగమిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగవచ్చు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారం ఆశాజనకంగా సాగుతుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటావు. విద్యార్థులు కొంత శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, ఒత్తిడి పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారంలో ఆదాయం కొంత పెరుగుతుంది. ప్రతి పని నిదానంగా పూర్తవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటావు. విద్యార్థులు కొంత శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
సమస్యలు, ఒత్తిళ్ల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. అదృష్టం కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం చేసినా సఫలమవుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటావు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

