Beauty Tips

Morning Skin Care Routine:ఉదయం లేవగానే ఇలా చేస్తే చాలు.. మెరిసే చర్మం మీ సొంతం..

ఉదయం స్కిన్ కేర్ రొటీన్: ఈ సాధారణ చిట్కాలతో మెరిసే చర్మం మీ సొంతం..ప్రతి ఒక్కరూ తమ ముఖం అందంగా, మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. ఈ కోరికతో అమ్మాయిలు, అబ్బాయిలు రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు.

కానీ, చాలా సార్లు ఆశించిన ఫలితాలు రావు. అలాంటి సమయంలో ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని సులభమైన స్కిన్ కేర్ చిట్కాలు పాటిస్తే, చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉంటుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారు ఉదయం ఈ రొటీన్‌ను అనుసరిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

1. ముఖాన్ని శుభ్రం చేయండి:
ఉదయం నిద్రలేచిన తర్వాత మొదటగా చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇది రాత్రంతా చర్మంపై పేరుకున్న నూనె, ధూళిని తొలగిస్తుంది. చల్లటి నీరు చర్మ రంధ్రాలను బిగుతు చేసి, అదనపు నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది. కావాలంటే, మీ చర్మానికి సరిపడే సౌమ్యమైన ఫేస్ వాష్‌ను కూడా ఉపయోగించవచ్చు.

2. కలబంద జెల్ ఉపయోగించండి:
జిడ్డు చర్మం ఉన్నవారికి కలబంద జెల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని చల్లబరుస్తూ నూనె ఉత్పత్తిని సమతుల్యం చేస్తుంది. ముఖం కడిగిన తర్వాత, స్వచ్ఛమైన కలబంద జెల్‌ను ముఖం అంతా సమానంగా రాయండి. ఇది చర్మాన్ని తేమగా, హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా, మొటిమల సమస్యను కూడా తగ్గిస్తుంది.

3. రోజ్ వాటర్ లేదా టోనర్‌తో టోనింగ్ చేయండి:
టోనర్ చర్మం రో ఖ రసాయన సమతుల్యతను పునరుద్ధరిస్తుంది మరియు ఓపెన్ ఫోర్స్‌ను తగ్గిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి సహజమైన రోజ్ వాటర్ ఒక గొప్ప టోనర్. దీనిని స్ప్రే రూపంలో ముఖంపై చల్లుకోవచ్చు లేదా కాటన్‌తో అప్లై చేయవచ్చు. ఇది చర్మాన్ని తాజాగా, ఆయిల్-ఫ్రీగా ఉంచుతుంది.

4. ఆయిల్-ఫ్రీ మాయిశ్చరైజర్ రాయండి:
జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ అవసరం లేదని భావిస్తారు, కానీ ఇది తప్పుడు అభిప్రహం. చర్మం హైడ్రేటెడ్‌గా లేకపోతే, అది ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తుంది. అందుకే, ఉదయం జెల్ ఆధారిత లేదా నూనె-రహిత మాయిశ్చరైజర్‌ను తప్పక ఉపయోగం చేయండి.

5. సన్‌స్క్రీన్‌ను మర్చిపోవద్దు:
ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా సన్‌స్క్రీన్ అప్లై చేయడం తప్పనిసరి. జిడ్డు చర్మానికి మ్యాట్ ఫినిష్ లేదా జెల్ ఆధారిత సన్‌స్క్రీన్ ఉత్తమం. ఇది సూర్యుడి హానికర కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతూ, ఆయిల్-ఫ్రీ లుక్‌ను అందిస్తుంది.

ఈ సులభమైన ఉదయం స్కిన్ కేర్ రొటీన్‌ను పాటించడం వల్ల చర్మం మెరుస్తూ, ఆరోగ్యంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. మార్కెట్‌లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్‌కు బదులుగా, ఈ సహజ చిట్కాలు మరియు హోం రెమెడీస్‌ను అనుసరించడం వల్ల గ్లోయింగ్ స్కిన్ సులభంగా సొంతం చేసుకోవచ్చు!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ