Business

Andhra Pradesh Thalliki Vandanam: “తల్లికి వందనం” డబ్బులు ఇంకా పడలేదా.. అయితే ఇలా చేయండి…

Andhra Pradesh Thalliki Vandanam:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకం ద్వారా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ. 13,000 జమ చేసిన విషయం తెలిసిందే. జూన్ 13 నుంచి అర్హులైన తల్లుల ఖాతాల్లో ఈ నగదు బదిలీ అయింది.

అయితే, కొందరు తల్లులు ఈ డబ్బులు అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం ఇప్పటికే సానుకూల సమాచారం అందించింది. జీవో ప్రకారం, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ డబ్బులు జమ కాని వారు తమ సమస్యను ఫిర్యాదు చేయవచ్చు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి…

“తల్లికి వందనం” పథకం కింద, రూ. 15,000 మొత్తంలో రూ. 13,000 తల్లుల ఖాతాల్లో జమ చేయగా, మిగిలిన రూ. 2,000 పాఠశాల నిర్వహణ గ్రాంట్ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో జమ చేశారు. ఒక్కో విద్యార్థికి రూ. 13,000 సాయం అందిస్తుండగా, ఇద్దరు పిల్లలున్న తల్లులకు రూ. 26,000, ముగ్గురు పిల్లలున్న తల్లులకు రూ. 39,000 జమ చేస్తున్నారు.

డబ్బులు అందని వారు గ్రామ/వార్డు సచివాలయాలను సంప్రదించి, సంబంధిత దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి జూన్ 20లోగా సమర్పించాలి. ఈ ఫిర్యాదులను జూన్ 28లోగా పరిశీలించి, జూన్ 30న కొత్త అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అర్హులైన వారికి జూలై 5న నిధులు జమ చేస్తారు.

ఈ పథకం 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది. ప్రస్తుతం 2 నుంచి 10వ తరగతి, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరిన విద్యార్థుల తల్లుల జాబితాను కూడా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి, వారికి నిధులు విడుదల చేయనున్నారు.

తల్లికి వందనం అర్హతలు:
– కుటుంబ ఆదాయం పట్టణాల్లో నెలకు రూ. 12,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10,000 మించకూడదు.
– కుటుంబంలో ఒకరి పేరు రైస్ కార్డులో తప్పనిసరిగా ఉండాలి.
– మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలు లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి.
– నాలుగు చక్రాల వాహనం (ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో మినహా) ఉండకూడదు.
– విద్యుత్ వినియోగం సంవత్సరానికి సగటున 300 యూనిట్లు మించకూడదు.
– పట్టణాల్లో 1,000 చదరపు అడుగులకు మించిన ఆస్తి ఉండకూడదు.
– కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు అనర్హులు.
– పింఛన్ తీసుకునే వారు అనర్హులు.
– పారిశుద్ధ్య కార్మికులకు ఆదాయ పరిమితిలో మినహాయింపు ఉంది.
– ఆదాయపు పన్ను (ఐటీ) దాఖలు చేసే వారు అనర్హులు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ