DevotionalToday Rasi Phalalu In telugu

Today horoscope:నేటి రాశి ఫలాలు జూన్ 22, 2025: ఈరోజు ఈ రాశి వారికి మంచి గుర్తింపు..

Today horoscope:నేటి రాశి ఫలాలు జూన్ 22, 2025: ఈరోజు ఈ రాశి వారికి మంచి గుర్తింపు..:ప్రతి రోజు రాశి ఫలాలను చూసుకొని రోజును మొదలు పెట్టె వారు చాలా మంది ఉన్నారు. అలా జాతకాలను ఈ రోజుల్లో కూడా ఎక్కువగా నమ్ముతున్నారు. అయితే క్లొంత మంది జాతకాలను అసలు నమ్మరు.

మేషం
ఉద్యోగంలో మీ కృషి గుర్తింపును తెచ్చిపెడుతుంది. పనుల్లో అడ్డంకులు రాకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శివ ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.

వృషభం
మీ రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబ సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. కొందరు మిమ్మల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించవచ్చు, జాగ్రత్తగా ఉండండి. చంద్ర ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది.

మిథునం
ఇది అనుకూలమైన సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా ముగిస్తారు. శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. కీర్తి, ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. ప్రయాణాలు సఫలమవుతాయి. దైవారాధనను ఎట్టిపరిస్థితుల్లోనూ మానకండి.

కర్కాటకం
కొందరి వల్ల అడ్డంకులు ఎదురవ్వవచ్చు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్త వహించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. శివ ఆరాధన శుభప్రదం.

సింహం
నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయడానికి పూర్తి శక్తితో కృషి చేస్తారు, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కలహాలకు దూరంగా ఉండండి. అలసట రాకుండా జాగ్రత్త పడండి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.

కన్య
మీ లక్ష్యాలు సఫలమవుతాయి. సహచరులతో ఆనందాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి, గౌరవం పొందుతారు. ధన, వస్త్ర లాభాలు కలుగుతాయి. సూర్య నమస్కారం చేయడం వల్ల శుభం జరుగుతుంది.

తుల
అనుకున్న పనులు సఫలమవుతాయి. సహచరులతో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ధన, వస్త్ర లాభాలు లభిస్తాయి. తల్లిదండ్రులను గౌరవించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం
మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికర ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటం వద్దు. ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం.

ధనుస్సు
మీ వినయం, విధేయతలు మిమ్మల్ని కాపాడతాయి. ఇప్పటివరకు అనుకూలంగా ఉన్నవారు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సంబంధాలను బలోపేతం చేసుకోండి. ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడండి. అష్టలక్ష్మీ స్తోత్రం పఠించడం మంచిది.

మకరం
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. మొహమాటాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది.

కుంభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాలను సమయస్ఫూర్తిగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. శ్రీ విష్ణు ఆరాధన శుభప్రదం.

మీనం
మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా ఎవరు ఆప్తులు, ఎవరు కాదని తెలుస్తుంది. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. గురు ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ