Today Horoscope in Telugu:ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి..
Today Horoscope in Telugu:ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి..ఈ మధ్య కాలంలో జాతకాలను నమ్మే వారు చాలా ఎక్కువ అయ్యారు. ఏదైనా సమస్య వచ్చిన కుఇడ మనలో చాలా మంది జాతకాలను ఆశ్రయిస్తున్నారు.
మేషం
ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురవవచ్చు. ఆతురత నిర్ణయాలు మానుకోండి. ఎవరినీ అతిగా నమ్మకుండా ఉండటం మంచిది. మనసును స్థిరంగా ఉంచుకోండి. ఒక శుభవార్త ఆనందాన్ని తెస్తుంది. వేంకటేశ్వరస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
వృషభం
మనోధైర్యంతో చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. కోరిన కార్యాలు సిద్ధిస్తాయి. సమచిత్తంతో ఆలోచిస్తే గొప్ప గుర్తింపు పొందుతారు. మాటలో నీతిని కాపాడుకోవాలి. ధనలాభం, సంపద వృద్ధి ఉంటాయి. సమయానికి సహాయం అందించేవారు ఉంటారు. ఇష్టదైవ ధ్యానం శుభ ఫలితాలనిస్తుంది.
మిథునం
శారీరక శ్రమను తగ్గించుకోవడం మంచిది. గతంలో అసంపూర్తిగా ఉన్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. కృషితో ఆర్థిక లాభం సాధ్యమవుతుంది. దుర్గాదేవి శ్లోకాలను పఠించడం శుభం.
కర్కాటకం
మీ రంగంలో సామాన్య ఫలితాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్త వహించాలి. సహచరుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలరు. మనశ్శాంతిని కాపాడుకోవాలి. శివాష్టోత్తరం చదవడం మంచి ఫలితాలనిస్తుంది.
సింహం
బంధుమిత్రులతో సంతోషకరమైన సమయం గడుస్తుంది. అధికారుల సహకారంతో ఒక పని సఫలమవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. పెద్దల సలహాలతో సమస్యలు తగ్గుతాయి.
కన్య
పెద్దల సలహాలు బలాన్నిస్తాయి. మనసును కలవరపెట్టే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానం ఆపదల నుంచి కాపాడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శని శ్లోకాలను చదవడం మంచిది.
తుల
ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రద్ధ చూపాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. అనవసర వివాదాల సూచన ఉంది, కాబట్టి ఊరకనే ఉండటం ఉత్తమం. శివనామస్మరణ శుభఫలితాలనిస్తుంది.
వృశ్చికం
పట్టుదలతో ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. ముఖ్యమైన విషయంలో అధికారులతో సంప్రదింపులు జరుగుతాయి, ఫలితం సానుకూలంగా ఉంటుంది. అప్పుల భారం పెరగకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్యస్వామి శ్లోకాలు చదవడం మేలు చేస్తుంది.
ధనుస్సు
చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం ఉంటుంది. ముఖ్య విషయాల్లో చురుకైన నిర్ణయాలతో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభం కలిగిస్తుంది.
మకరం
ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు ఉంటాయి. ధర్మకార్యాలలో విజయం సాధిస్తారు. మీ రంగంలో గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఇష్టమైన వారితో సమయం ఆనందంగా గడుస్తుంది. భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తారు. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.
కుంభం
తోటివారి సహాయం, సహకారం లభిస్తాయి. బంధుమిత్రులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. మీ తెలివితేటలతో కీలక సమస్యలను పరిష్కరించి మన్ననలు పొందుతారు. ధనవృద్ధి, మాతృసౌఖ్యం ఉంటాయి. ప్రయాణాలు ఫలవంతమవుతాయి. గణపతి ఆరాధన మంచిది.
మీనం
ఫలితాలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. బంధుమిత్రులతో ఆనందకరమైన సమయం గడుస్తుంది. కుటుంబ సభ్యులకు శుభం కలుగుతుంది. కీర్తి, మనోల్లాసం, ధర్మసిద్ధి లభిస్తాయి. మంచి సాంగత్యం ఏర్పడుతుంది. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

