Beauty Tips

Skin Whitening at Home: ముఖం అందంగా, కాంతివంతంగా కనిపించాలంటే బ్యూటీ పార్లర్ కి వెళ్ళే అవసరమే లేదు..

Skin Whitening at Home: ముఖం అందంగా, కాంతివంతంగా కనిపించాలంటే బ్యూటీ పార్లర్ కి వెళ్ళే అవసరమే లేదు.. ముఖం అందంగా, కాంతివంతంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చర్మాన్ని తెల్లగా, మెరిసేలా చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఫలితం సంతృప్తికరంగా ఉండకపోవచ్చు.

సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన ఈ చిట్కాలు మీ చర్మాన్ని తెల్లగా, ఆరోగ్యకరమైన గ్లోతో మెరిసేలా చేస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, క్రమం తప్పకుండా ఈ టిప్స్ పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ ఫేస్ ప్యాక్‌లను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాలు, టమాటా ఫేస్ ప్యాక్
ఒక చిన్న గిన్నెలో 4 టీస్పూన్ల పాలు, టమాటా గుజ్జు కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇది ముఖంపైని మృతకణాలు, మలినాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

2. గుడ్డు, కలబంద ఫేస్ ప్యాక్
గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలో తీసుకుని, దానిలో కలబంద గుజ్జు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి, అరగంట తర్వాత ఫేస్ వాష్‌తో శుభ్రం చేయండి. ఇది యాంటీ-ఏజింగ్ లక్షణాలతో మొటిమలు, మచ్చలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

3. పెరుగు, ఓట్‌మీల్ ఫేస్ ప్యాక్
పెరుగులో ఓట్‌మీల్ పౌడర్ కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారుచేయండి. దీన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే, చర్మానికి తేమ అందుతుంది. ముఖం తాజాగా, మెరిసేలా కనిపిస్తుంది.

4. తేనె, దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్
ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయండి. ఇది మొటిమలు, ముడతలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

5. పెరుగు, నిమ్మరసం ఫేస్ ప్యాక్
ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాయండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇది ముఖంపై జిడ్డును తొలగించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

6. కొబ్బరి నూనె, పసుపు ఫేస్ ప్యాక్
ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించండి. అరగంట తర్వాత సాధారణ నీటితో కడిగేస్తే, చర్మం తక్షణమే నిగారించి మెరుస్తుంది.

7. తేనె, కాఫీ ఫేస్ మాస్క్
ఒక గిన్నెలో 2 టీస్పూన్ల కాఫీ పొడి, 1 టీస్పూన్ తేనె కలిపి ముఖానికి రాయండి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి, కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

8. రైస్ వాటర్, గోధుమ పిండి ఫేస్ ప్యాక్
రైస్ వాటర్‌లో 1 టీస్పూన్ గోధుమ పిండి కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారుచేయండి. దీన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇది చర్మంపైని మలినాలను తొలగించి, ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ