RRB Railway Jobs 2025: నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా రైల్వే ఉద్యోగాలు..
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారతీయ రైల్వేలు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,180 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులు 180, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులు సుమారు 6,000 ఉన్నాయి. సమాచారం ప్రకారం, జూన్ 28, 2025న నోటిఫికేషన్ విడుదల కానుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 28 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు క్రింద తనిఖీ చేయండి.
సికింద్రాబాద్‌తో సహా అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము-శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ వంటి ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 28, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురితమైన సంక్షిప్త నోటిఫికేషన్ ప్రకారం, 2025 జులై 1 నాటికి గ్రేడ్-I అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య, గ్రేడ్-III అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము వంటి పూర్తి వివరాలు త్వరలో విడుదలయ్యే వివరణాత్మక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే, రీజియన్‌ల వారీగా ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష సిలబస్ వంటి వివరాలు కూడా అందులో ఉంటాయి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

