IRCTC tour package: అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. బడ్జెట్ ధరలో..
IRCTC టూర్ ప్యాకేజీ: తమిళనాడులోని పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. అక్కడి అరుణాచలేశ్వర ఆలయంలో పరమశివుడిని దర్శించుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తారు. వారి కోసం ఐఆర్‌సీటీసీ ‘అరుణాచల మోక్ష యాత్ర’ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
ఈ ప్యాకేజీలో అరుణాచలంతో పాటు కాంచీపురంలో కామాక్షి అమ్మవారి దర్శనం, పుదుచ్చేరిలో ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఈ యాత్ర 4 రాత్రులు, 5 పగళ్లు కొనసాగుతుంది. కాచిగూడ నుంచి ప్రతి గురువారం రైలు అందుబాటులో ఉంటుంది, టూర్ ముగిసిన తర్వాత అదే స్టేషన్‌లో దిగవచ్చు. జూన్ 19 నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రయాణ వివరాలు:
– మొదటి రోజు: కాచిగూడ నుంచి సాయంత్రం 5 గంటలకు (కాచిగూడ-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నం: 17653) రైలు బయల్దేరుతుంది. రాత్రంతా ప్రయాణం.
– రెండవ రోజు: ఉదయం 11:05 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటారు. హోటల్‌లో విశ్రాంతి తీసుకుని, అరోవిల్, అరబిందో ఆశ్రమం, బీచ్‌లను సందర్శిస్తారు. రాత్రి పుదుచ్చేరిలో బస.
– మూడవ రోజు: ఉదయం టిఫిన్ తర్వాత తిరువణ్ణామలై చేరుకుంటారు. హోటల్‌లో విశ్రాంతి తీసుకుని, అరుణాచలేశ్వర ఆలయంలో పరమశివుడిని దర్శించుకుంటారు. రాత్రి అక్కడే బస.
– నాల్గవ రోజు: ఉదయం అల్పాహారం తర్వాత కాంచీపురం బయల్దేరుతారు. అక్కడ కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయాలను దర్శిస్తారు. తర్వాత చెంగల్పట్టు స్టేషన్‌కు చేరుకుని, మధ్యాహ్నం 3:35 గంటలకు (ట్రైన్ నం: 17651) తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
– ఐదవ రోజు: ఉదయం 7:50 గంటలకు కాచిగూడ చేరుకుంటారు. ఇక్కడితో యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీ ఛార్జీలు:
బుక్ చేసే వ్యక్తుల సంఖ్య ఆధారంగా ఛార్జీలు మారుతాయి.
1-3 మంది బుకింగ్:
-కంఫర్ట్ (3 ఏసీ):
– ట్విన్ షేరింగ్: రూ.20,060
– ట్రిపుల్ షేరింగ్: రూ.15,610
– పిల్లలు (5-11 ఏళ్లు): విత్ బెడ్ రూ.11,750, వితౌట్ బెడ్ రూ.9,950
– స్టాండర్డ్ (స్లీపర్):
– ట్విన్ షేరింగ్: రూ.17,910
– ట్రిపుల్ షేరింగ్: రూ.13,460
– పిల్లలు (5-11 ఏళ్లు): విత్ బెడ్ రూ.9,590, వితౌట్ బెడ్ రూ.7,800
4-6 మంది బుకింగ్:
– కంఫర్ట్ (3 ఏసీ):
– డబుల్ షేరింగ్: రూ.16,390
– ట్రిపుల్ షేరింగ్: రూ.14,110
– పిల్లలు (5-11 ఏళ్లు): విత్ బెడ్ రూ.11,750, వితౌ Themes బెడ్ రూ.9,950
– స్టాండర్డ్ (స్లీపర్):
– డబుల్ షేరింగ్: రూ.14,240
– ట్రిపుల్ షేరింగ్: రూ.11,960
– పిల్లలు (5-11 ఏళ్లు): విత్ బెడ్ రూ.9,590, వితౌట్ బెడ్ రూ.7,800
గమనించాల్సినవి:
– ప్యాకేజీ ఆధారంగా 3 ఏసీ లేదా స్లీపర్ క్లాస్‌లో రైలు ప్రయాణం.
– స్థానిక ప్రయాణానికి ఏసీ వాహనం ఏర్పాటు.
– రెండు రోజుల బస, ఉదయం టిఫిన్ ఐఆర్‌సీటీసీ బాధ్యత.
– యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది.
– పర్యాటక స్థలాల్లో ప్రవేశ రుసుములు యాత్రికులే భరించాలి.
– ఐఆర్‌సీటీసీ పాలసీ ప్రకారం క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి.
– హోటల్ వివరాలు, ప్యాకేజీ సమాచారం, బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

