Amazon OffersMovies

OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ తో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్.. వన్‌ప్లస్ సంస్థ దీర్ఘ విరామం తర్వాత నెక్‌బ్యాండ్ స్టైల్ ఇయర్‌ఫోన్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 2022లో లాంచ్ చేసిన జడ్‌2కి కొనసాగింపుగా జడ్‌3ని తాజాగా పరిచయం చేసింది.

ఇందులో ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్, దీర్ఘకాల బ్యాటరీ బ్యాకప్, గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ సౌలభ్యంతో రూ.1,699 ధరకే అందుబాటులో ఉంది. ఇవి ఐపీ55 రేటింగ్‌తో వస్తాయి. మాంబూ మిడ్‌నైట్, సాంబా సన్‌సెట్ రంగుల్లో లభ్యమవుతాయి. చర్మానికి సౌకర్యవంతమైన సిలికాన్ మెటీరియల్‌తో ఈ ఇయర్‌ఫోన్స్‌ను రూపొందించినట్లు వన్‌ప్లస్ తెలిపింది.

ఈ ఇయర్‌ఫోన్స్‌లో 12.44 ఎంఎం డైనమిక్ బేస్ డ్రైవర్స్ ఉన్నాయి, ఇవి 3డీ స్పేషియల్ ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. ఏఐ ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కాల్ సమయంలో చుట్టూ ఉన్న శబ్దాలను అదుపు చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 36 గంటల పాటు పనిచేస్తాయని వన్‌ప్లస్ వెల్లడించింది.

యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా కేవలం 10 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని పేర్కొంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్, వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లలో లభిస్తాయి. అలాగే, క్రోమా, రిలయన్స్, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వంటి ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయి. జూన్ 24 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి.

గమనిక: ధరలు మరియు ఆఫర్‌లు మారవచ్చు, కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా సమాచారాన్ని చెక్ చేయండి.