SIM Cards:మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా… ఇలా చూసుకోండి
SIM Cards:మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా… ఇలా చూసుకోండి.. చాలామంది తమ పేరుతో ఎన్నో సిమ్ కార్డులు తీసుకుంటారు. కొందరు తమకు మాత్రమే కాక, బంధువులు, స్నేహితుల పేరుతో కూడా సిమ్ కార్డులు కొని ఇస్తుంటారు.
కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి పేరుతో తొమ్మిదికి మించి సిమ్ కార్డులు ఉంటే, అదనపు సిమ్‌లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
పాత సిమ్ కార్డుల వివరాలు తెలుసుకోవడం కష్టం. మీ పేరుతో ఎవరికి సిమ్ ఇచ్చారో గుర్తుంచుకోవడం అంతే కష్టం. కొన్ని సిమ్‌లు వాడుకలో ఉండొచ్చు, మరికొన్ని ఉండకపోవచ్చు. అందుకే, ప్రభుత్వం అందించే ‘సంచార్ సాతి’ వెబ్సైట్లో మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అవసరం లేని సిమ్‌లను నిలిపివేసే సౌకర్యం కూడా ఇందులో ఉంది.
విధానం:
1. గూగుల్‌లో https://sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌ను తెరవండి.
2. ‘సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్’ విభాగంలో ‘Know Your Mobile Connections’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఈ సేవను టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్ అందిస్తుంది.
3. కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో మీరు ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
4. క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, ‘వాలిడేట్ క్యాప్చా’ బటన్‌ను నొక్కండి.
5. మీ నంబర్‌కు వచ్చిన వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
6. మీ పేరుతో రిజిస్టర్ అయిన సిమ్ కార్డుల జాబితా వివరాలతో కనిపిస్తుంది.
7. అవసరం లేని లేదా వాడని సిమ్‌లను నిలిపివేయడానికి పక్కన ఉన్న ఆప్షన్‌ను ఎంచుకుని, సబ్మిట్ చేయండి.
8. చివరగా లాగ్ అవుట్ చేసి వెబ్‌సైట్‌ను మూసివేయండి.
ప్రయోజనం:
ఈ ప్రక్రియ వల్ల మీ పేరుతో ఉన్న సిమ్‌లను ఎవరైనా దుర్వినియోగం చేస్తే, మీరు నేర ఆరోపణల బారిన పడకుండా ఉంటారు. అనవసర సిమ్ కార్డులను వెంటనే నిలిపివేయడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

