Beauty Tips

Face Glow Tips:ముఖం మీద నల్లని మచ్చలు మాయం అవ్వాలంటే..

Face Glow Tips:ముఖం మీద నల్లని మచ్చలు మాయం అవ్వాలంటే.. ముఖంపైని మృతకణాలను ఇంట్లో దొరికే పదార్థాలతో సులభంగా తొలగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాగో తెలుసుకుందాం…

అలోవెరా స్క్రబ్‌: మూడు టేబుల్‌ స్పూన్ల అలోవెరా జెల్‌లో రెండు టీస్పూన్ల బియ్యం పిండి, ఒక టీస్పూను తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాసి పది నిమిషాలు మసాజ్‌ చేసి, ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి.

వాల్‌నట్‌ స్క్రబ్‌: రెండు వాల్‌నట్స్‌ను తీసుకుని పొడిగా చేయాలి. ఈ పొడిలో మూడు టీస్పూన్ల తేనె కలిపి పేస్ట్‌ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి. వాల్‌నట్స్‌లోని ఔషధ గుణాలు చర్మానికి పోషణనిస్తాయి, జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతాయి.

కాఫీ స్క్రబ్‌: నాలుగు టీస్పూన్ల కాఫీ పొడిలో రెండు టీస్పూన్ల బ్రౌన్‌ షుగర్‌, ఒక టీస్పూను తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులపై రాసి పదిహేను నిమిషాలు మసాజ్‌ చేసి, ఆరిన తర్వాత నీటితో కడగాలి. కాఫీ పొడిలోని యాంటీఆక్సిడెంట్స్‌ చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, తాజాగా ఉంచుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ