Today Horoscope in Telugu: జూన్ 28 12 రాశుల ఫలితాలు ఇలా… ఈ రాశి వారు డబ్భు విషయంలో జాగ్రత్త..
Today Horoscope in Telugu: జూన్ 28 12 రాశుల ఫలితాలు ఇలా… ఈ రాశి వారు డబ్భు విషయంలో జాగ్రత్త.. ఈ మధ్య కాలంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే జాతకాల వైపు అడుగులు వేస్తున్నారు. కొంత మంది జాతకాలను అసలు నమ్మరు.
మేషం
ఆలోచనలలో స్పష్టతతో భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో ఎదురైన సవాళ్లను దృఢ సంకల్పంతో అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుతాయి. హనుమాన్ స్తోత్రం పఠించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
వృషభం
శుభవార్త వింటారు, ఆర్థిక సాయం సకాలంలో అందడం మానసిక శాంతిని ఇస్తుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కుమారస్వామి దర్శనం సానుకూల శక్తిని పెంపొందిస్తుంది.
**మిథునం
పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా, వాటిని సమర్థంగా అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారంలో డబ్బు అందడం స్థిరత్వాన్ని ఇస్తుంది. వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. శివారాధన ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది.
కర్కాటకం
పనుల్లో అనవసర శ్రమను తగ్గించేందుకు ముందుచూపుతో వ్యవహరించండి. ఆత్మీయుల సహాయం మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. అతినమ్మకం నుంచి దూరంగా ఉండండి. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. ఈశ్వర దర్శనం శక్తిని, ఓర్పును అందిస్తుంది.
సింహం
అన్ని రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ముఖ్యమైన పనులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆనందకర సంఘటనలు జరుగుతాయి. శ్రీవేంకటేశ్వర దర్శనం శ్రేయస్సును పెంచుతుంది.
కన్య
వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం ఆంతరంగిక శాంతిని కలిగిస్తుంది.
తుల
పనుల్లో ఉత్సాహంగా, దృఢంగా ముందుకు సాగండి. ఆటంకాలను పట్టుదలతో అధిగమిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తి, గౌరవం తెస్తాయి. ఇష్టదైవ నామస్మరణ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
వృశ్చికం
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెట్టినా, స్థిరంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. గోసేవ సానుకూల ఆలోచనలను, మంచి ఫలితాలను ఇస్తుంది.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అద్భుత ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం మానసిక బలాన్ని ఇస్తుంది. సమయస్ఫూర్తితో స్పందిస్తే శుభం జరుగుతుంది. ఆర్థికంగా అనుకూల సమయం. ఇష్టదైవ దర్శనం ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తుంది.
మకరం
ముందుచూపుతో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పెద్దల సలహా తీసుకోవడం తెలివైన నిర్ణయం. రుణ సమస్యలు తగ్గడం మానసిక శాంతిని ఇస్తుంది. ఇష్టదేవతా ఆరాధన ఆశావహ దృక్పథాన్ని అందిస్తుంది.
కుంభం
అన్ని రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సూర్యారాధన సమస్యలను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది.
మీనం
కొన్ని రంగాల్లో శ్రమ ఎదురవుతుంది. ఓర్పుతో వ్యవహరించండి, సహనం కోల్పోకండి. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శివ సహస్రనామ పారాయణ సానుకూలతను పెంచుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

