Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం
కొన్ని పనులలో అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి ఆదరణ లభిస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వాహనాలు, భూముల కొనుగోలు జరుగుతుంది. ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు మిశ్రమ ఫలితాలనిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి కొంత తగ్గుతుంది. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనల అవకాశం. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు, శ్రమాధిక్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. గణేశ స్తోత్రాలు పఠించండి.
వృషభం
ముఖ్యమైన వ్యవహారాలను సాఫీగా పూర్తి చేస్తారు. సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగి, స్థిరత కనిపిస్తుంది. బంధువుల నుంచి ధనలాభం. చిన్ననాటి మిత్రులతో సమావేశం. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్య, ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
శుభకార్యాలతో హడావిడిగా గడుపుతారు. వ్యాపారాలు మెరుగ్గా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు సంభవం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు విజయవంతం. వారం మధ్యలో అనారోగ్యం, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి. ఆకుపచ్చ, నీలం రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మిథునం
ఎంత కష్టపడినా ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో అడ్డంకులు. ఆర్థిక పరిస్థితి అనుకూలించక రుణాలు చేయవలసి రావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులను కలిసేందుకు ప్రయత్నిస్తారు.
ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు. కళారంగంలో ప్రోత్సాహం తక్కువ. వారం మధ్యలో శుభవార్తలు, వాహనయోగం. గులాబీ, నీలం రంగులు. విష్ణు సహస్రనామం పఠించండి.
కర్కాటకం
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలను నేర్పుగా పరిష్కరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.
సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణం, కొనుగోలు ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మార్పులు సంభవించవచ్చు. కళారంగంలో అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం చివరిలో ఖర్చులు, ఆరోగ్య సమస్యలు. నీలం, నేరేడు రంగులు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
సింహం
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలను కార్యరూపంలోకి తెస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. స్థిరాస్తి కొనుగోలులో అడ్డంకులు తొలగుతాయి. పోటీ పరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. గతాన్ని విస్మరించి భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. వాహనయోగం. పరిస్థితులు అనుకూలం.
ప్రముఖుల పరిచయంతో సహాయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు లభించవచ్చు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు, బంధువిరోధాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. శ్రీరామ రక్షాస్తోత్రం పఠించండి.
కన్య
అనుకున్న పనులు కొంత ఆలస్యమైనా పూర్తవుతాయి. ఆత్మీయులు, బంధువులతో సమస్యలను పరిష్కరిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నమ్మిన సిద్ధాంతాలను అనుసరిస్తారు. ఎవరి అడ్డగింతలనూ లెక్కచేయరు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం, ఆరోగ్య సమస్యలు. గులాబీ, పసుపు రంగులు. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.
తుల
ముఖ్య వ్యవహారాలలో అడ్డంకులను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది. కుటుంబసభ్యుల సలహాలను స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. బంధువులతో సఖ్యత. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సానుకూలం.
నిరుద్యోగుల కలలు నెరవేరతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూలం. వారం చివరిలో అనారోగ్యం, శ్రమ, బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. శివ పంచాక్షరి పఠించండి.
వృశ్చికం
ముఖ్యమైన పనులు కొంత ఆలస్యమైనా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగై రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. నిర్ణయాలను అందరూ మెచ్చుకుంటారు.
విద్యార్థులకు నిరీక్షణ ఫలిస్తుంది, విదేశీ విద్యావకాశాలు లభించవచ్చు. ఆలయ సందర్శనలు. వాహనాలు, భూముల కొనుగోలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ సమస్యలు పరిష్కారం. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం, అనారోగ్యం, శ్రమ. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు
కొన్ని పనులలో అడ్డంకులు ఎదురైనా, పట్టుదలతో విజయం సాధిస్తారు. ఆత్మబలం, ధైర్యం మీ బలం. ప్రత్యర్థుల యత్నాలు విఫలమవుతాయి. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి.
కొన్ని సమస్యలు పరిష్కారం. తీర్థయాత్రలు. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం, కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. **ఎరుపు, ఆకుపచ్చ రంగులు**. **ఆదిత్య హృదయం** పఠించండి.
మకరం
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. మిత్రులు మీ అభిప్రాయాలను సమర్థిస్తారు. బంధువుల రాకతో సందడి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆలయ సందర్శనలు. నిరుద్యోగులకు శుభవార్త. నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు.
సంఘంలో మర్యాదలు. వాహనాలు, భూముల కొనుగోలు. వ్యాపారాలు విస్తరణ. ఉద్యోగ సమస్యలు తీరతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహం. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఒత్తిడులు, శ్రమ. ఎరుపు, నేరేడు రంగులు. దేవీ స్తోత్రాలు పఠించండి.
కుంభం
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. గత పొరపాట్లను సరిదిద్దుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.
చిన్ననాటి మిత్రులను కలిసి వేడుకలకు ఆహ్వానిస్తారు. సంఘంలో గౌరవం. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు. ఉద్యోగాలలో పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు గుర్తింపు. వారం చివరిలో అనారోగ్యం, మిత్రులతో కలహాలు. గులాబీ, తెలుపు రంగులు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మీనం
కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. సోదరులు, మిత్రుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పేరు, ప్రతిష్ఠలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. నిరుద్యోగుల కలలు నెరవేరతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.
స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. కుటుంబసభ్యులతో భావాలు పంచుకుంటారు. నేర్పు, ఓర్పుతో సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరణ. ఉద్యోగాలలో పురోగతి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు, ధనవ్యయం. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు. నృసింహ స్తోత్రాలు పఠించండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

