Today Horoscope: జూన్ 30 రాశి ఫలాలు.. ఈ 4 రాశుల వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు
Today Horoscope: జూన్ 30 రాశి ఫలాలు.. ఈ 4 రాశుల వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.. మనలో చాలా మంది జాతకాలను నమ్ముతారు. అలాగే కొంత మంది అసలు నమ్మరు. అయితే ఈ ఆర్టికల్ జాతకాలను నమ్మే వారి కోసం మాత్రమే..
మేషం
ఈ రోజు మీ దృఢ సంకల్పాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాలలో ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉత్సాహంగా పని చేస్తేనే లక్ష్యాలను సాధిస్తారు. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, కాబట్టి మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. అనవసర ఖర్చులను నివారించి ఆర్థిక నియంత్రణ పాటించండి. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.
వృషభం
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో కొన్ని అడ్డంకులు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. అస్థిర ఆలోచనలకు లోనవకుండా స్థిరంగా ఉండండి. నవగ్రహ శ్లోకం పఠించడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి.
మిథునం
ఈ రోజు వివిధ రంగాలలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధన, ధాన్య వృద్ధి, సన్మానం, సుఖం, విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. గణపతి ఆరాధన చేయడం శుభప్రదం.
కర్కాటకం
ఈ రోజు ఆశించిన ఫలితాల కోసం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. క్షమాగుణంతో వ్యవహరిస్తే బంధాలు బలపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి కోసం అంకితభావంతో కష్టపడండి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.
సింహం
భవిష్యత్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనులలో శుభ ఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభ, నిబద్ధతకు ప్రశంసలు లభిస్తాయి. శివనామ స్మరణ శ్రేయస్కరం.
కన్య
మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. పనులలో శ్రమ పెరిగే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక నియంత్రణ అవసరం. విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది.
తుల
సుఖ సౌఖ్యాలు లభిస్తాయి. మిత్రుల సహకారం అందుతుంది. ముఖ్యమైన విషయంలో పెద్దలను కలిసి అనుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక యోగం శుభప్రదం. సూర్య ఆరాధన మంచిది.
వృశ్చికం
పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. కలహాలకు దూరంగా ఉండండి. ఆదిత్య హృదయం పఠించడం మేలు చేస్తుంది.
ధనుస్సు
పట్టుదలతో పని చేసి లక్ష్యాలను సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శ్రమ పెరుగుతుంది, మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. దుర్గా అష్టోత్తరం పఠించడం శుభం.
మకరం
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సౌఖ్యం, ధైర్యం, శరీర బలం, కీర్తి, భోజన సౌఖ్యం లభిస్తాయి. శ్రీ దుర్గా ఆరాధన మంచిది.
కుంభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ దర్శనం శుభప్రదం.
మీనం
మానసిక సౌఖ్యం లభిస్తుంది. అన్ని రంగాలలో మంచి పేరు సంపాదిస్తారు. శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. శివ ఆరాధన మేలు చేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

