Today Horoscope in Telugu: జూలై 1 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ ఖర్చు ఎక్కువ..
Today Horoscope in Telugu: జూలై 1 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ ఖర్చు ఎక్కువ.. ఈ మధ్య కాలంలో జాతకాలను నమ్మే వారు చాలా ఎక్కువ అయ్యారు. అయితే కొంత మంది జాతకాలను అసలు నమ్మరు.
మేషం
కొన్ని పరిస్థితులు నిరాశను కలిగిస్తాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన అంశాలు ఇబ్బందులను తెచ్చిపెడతాయి. కలహాల సూచన ఉంది. గోసేవ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
వృషభం
ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందు సాధకబాధకాలను జాగ్రత్తగా అంచనా వేయాలి. ముందుచూపుతో వ్యవహరిస్తే అడ్డంకులు తొలగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో శ్రద్ధ వహించాలి. శివారాధన శుభప్రదం.
మిథునం
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. బంధువులతో సౌహార్దం ఉంటుంది. వస్త్ర, ధన లాభాలు సాధ్యమవుతాయి. దుర్గాస్తుతి చదవడం శుభకరం.
కర్కాటకం
అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో శ్రద్ధ అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంది. వైరాగ్యం దరిచేరకుండా చూసుకోండి. నవగ్రహ స్తోత్రం పఠనం మంచి ఫలితాలను ఇస్తుంది.
సింహం
ప్రారంభించిన పనులలో అడ్డంకులను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి దర్శనం శుభప్రదం.
కన్య
కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. స్వల్ప ధనలాభం, మానసిక సంతోషం కలుగుతాయి. అదృష్ట యోగం ఉంది. వ్యాపారంలో పురోగతి సాధ్యమవుతుంది. అష్టలక్ష్మీ స్తుతి చదవడం మంచిది.
తుల
ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సలహాలు కీలక నిర్ణయాలకు ఉపయోగపడతాయి. నవగ్రహ స్తోత్రం పఠనం శుభకరం.
వృశ్చికం
ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది కలిగించే వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. లింగాష్టకం చదవడం మంచిది.
ధనుస్సు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరమైన సహాయం అందుతుంది. కొన్ని పనులలో ఇబ్బందులు ఎదురైనా, వాటిని అధిగమిస్తారు. శని శ్లోకం పఠనం శుభప్రదం.
మకరం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సందర్భానుసారంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మీ పట్టుదల ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.
కుంభం
ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభదాయకంగా ఉంటాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదవడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి.
మీనం
ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేరుస్తుంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆహార నియమాలు పాటించాలి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శ్రేయస్కరం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

