Business

Stocks To Watch: జూన్ 2వ తేదీ, బుధవారం.. ఈ స్టాక్స్ పై ఓ లుక్ వేయండి…

Stocks To Watch:జూలై 2, 2025, బుధవారం రోజున గమనించాల్సిన స్టాక్స్ ఇవే… ఈ స్టాక్స్ నేడు మార్కెట్ ట్రేడింగ్‌లో మంచి కదలికలు చూపించే అవకాశం ఉంది.

1. మారుతి సుజుకి: జూన్ నెలకు సంబంధించిన కార్ల విక్రయాల వివరాలు వెల్లడయ్యాయి. జూన్‌లో కార్ల విక్రయాలు 6.3% తగ్గాయి, దేశీయ అమ్మకాలు 12.2% తగ్గినట్లు తెలిసింది. అయితే, ఎగుమతులు 21.9% పెరిగాయని సంస్థ స్టాక్ మార్కెట్ ఫైలింగ్‌లో తెలిపింది.

2. ఏషియన్ పెయింట్స్: గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఈ సంస్థపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. కంపెనీపై యాంటీ-కాంపిటీటివ్ పద్ధతుల ఆరోపణలతో విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.

3. JSW ఎనర్జీ: ఈ సంస్థ రాజస్థాన్ విద్యుత్ ఉత్పత్తి సంస్థతో 12 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 250MW/500MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని సంస్థ స్టాక్ మార్కెట్ ఫైలింగ్‌లో పేర్కొంది.

4. RITES-ARYAN JV: కర్ణాటకలోని తుమకూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ఈ సంస్థకు 30 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆర్డర్ లభించింది. ఈ విషయాన్ని సంస్థ స్టాక్ మార్కెట్ ఫైలింగ్‌లో తెలిపింది.

5. బజాజ్ ఫైనాన్స్: దేశంలోనే అతిపెద్ద ఫగజైనాన్స్ కంపెనీలలో ఒకటైన బజాజ్ ఫైనాన్స్‌లో రూరల్ లెండింగ్, గోల్డ్ లోన్, ఇన్సూరెన్స్ విభాగాల ప్రెసిడెంట్ దీపక్ రెడ్డి రాజీనామా చేశారు.

6. NIBE: ఈ సంస్థ ప్రముఖ డిఫెన్స్ సంస్థ నుంచి 23 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ పొందినట్లు తెలిపింది.

7. లాయిడ్స్ మెటల్స్: మొదటి త్రైమాసికంలో సంస్థ ఐరన్ ఓర్ ఉత్పత్తి 40 లక్షల టన్నులుగా ఉందని స్టాక్ మార్కెట్ ఫైలింగ్‌లో వెల్లడించింది.

**డిస్‌క్లైమర్:** ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీలు లేదా ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీ పెట్టుబడులు లేదా వ్యాపార నిర్ణయాల వల్ల జరిగే లాభనష్టాలకు chaipakodi బాధ్యత వహించదు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలని chaipakodi సూచిస్తుంది.