AP Digital Lakshmi Scheme 2025:ఏపీ లో మహిళలకు భారీ శుభవార్త.. ఇంటి నుండి పని చేసుకునే అవకాశం..
AP Digital Lakshmi Scheme 2025:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ‘డిజిటల్ లక్ష్మి’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలకు డిజిటల్ పరిజ్ఞానం, ఆర్థిక స్వావలంబనతో కూడిన ఉపాధి అవకాశాలను అందించే లక్ష్యంతో 250 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా 9,034 కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ) ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్ల నిర్వహణ కోసం శిక్షణకు రూ.23.84 కోట్లు కేటాయించగా, ఎంపికైన సభ్యులకు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు తక్కువ వడ్డీ రుణాలు అందించనున్నారు.
డిజిటల్ లక్ష్మి పథకం వివరాలు
పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల (SHG) సభ్యులు ఈ పథకానికి అర్హులు. ఈ సెంటర్ల ద్వారా ప్రజలు పలు పౌర సేవలను పొందవచ్చు, డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ సీఎస్‌సీ కేంద్రాలు మీ సేవా కేంద్రాల తరహాలో పనిచేస్తాయి, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.
అర్హతలు
– పట్టణ ప్రాంతంలో స్వయం సహాయక బృందంలో కనీసం 3 సంవత్సరాల సభ్యత్వం.
– 21 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు.
– కనీసం డిగ్రీ విద్యార్హత.
– ప్రాథమిక కంప్యూటర్ శిక్షణ తప్పనిసరి.
– ఇంటి నుంచి పనిచేసే సామర్థ్యం, ఉపాధి కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
– ప్రతి స్లమ్ లెవెల్ ఫెడరేషన్ (SLF) నుంచి ఒక మాస్టర్ ఎంపిక.
– ప్రతి 25 SHGలకు ఒక డిజిటల్ లక్ష్మిని ఎంపిక చేస్తారు (మొత్తం 250 మంది).
– కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఇంటర్నెట్ సౌకర్యం అవసరం.
– ఎంపిక పూర్తిగా SLF ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు విధానం
– మీ సేవా కేంద్రం లేదా సీఎస్‌సీ ద్వారా దరఖాస్తు చేయాలి.
– అవసరమైన పత్రాలు:
– ఆధార్ కార్డ్
– SHG సభ్యత్వ రుజువు
– విద్యార్హత సర్టిఫికెట్లు
– బ్యాంక్ ఖాతా వివరాలు
– ఆదాయ ధ్రువీకరణ పత్రం
పథకం ఉపయోగాలు
– డిజిటల్ కియోస్క్‌లు లేదా సీఎస్‌సీ సెంటర్ల ఏర్పాటు.
– ఇంటి నుంచి ఉపాధి అవకాశాలు.
– చుట్టుపక్కల ప్రజలకు డిజిటల్ సేవలు అందించి ఆదాయం పొందే అవకాశం.
– మహిళలకు స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన.
– పథకం ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణలో అమలవుతుంది.
అధికారిక వెబ్‌సైట్
వివరాల కోసం సందర్శించండి: https://ap.meeseva.gov.in](https://ap.meeseva.gov.in
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

