DevotionalToday Rasi Phalalu In telugu

Rasi Phalalu:జూలై 3 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

Rasi Phalalu:జూలై 3 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఈ రోజుల్లో మనలో చాలా మంది జాతకాలను నమ్ముతున్నారు. అయితే కొంత మంది జాతకాలను అసలు నమ్మరు.

మేష రాశి: ఈ రోజు అన్ని విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కొత్త వ్యాపార ఆలోచనలు మొదలవుతాయి. పెట్టుబడులకు శుభ సమయం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ధనలాభం సాధ్యం. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. వీలైతే అమ్మవారి ఆలయానికి వెళ్లండి. లక్కీ నెంబర్: 4

వృషభ రాశి: అనుకున్న పనులు సఫలమవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు లేదా ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ రోజు చాలా అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వినే అవకాశం. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. వీలైతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. లక్కీ నెంబర్: 7

మిథున రాశి: ఈ రోజు అన్ని విధాలా శుభకరం అయినప్పటికీ, అనవసర వాగ్వివాదాలు జరిగే సూచన ఉంది. మిగతా అన్ని విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులు, కన్సల్టెంట్‌లకు లాభదాయకం. పాత బాకీలు వసూలయ్యే అవకాశం. పోటీ పరీక్షలకు ఈ రోజు చాలా మంచిది. భార్యాభర్తలు అనవసర నిర్ణయాలు తీసుకోవద్దు. దుర్గాదేవి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. లక్కీ నెంబర్: 3

కర్కాటక రాశి: ఈ రోజు అప్పులు చేయడం లేదా ఇవ్వడం మానుకోండి, ఎందుకంటే వసూలు అయ్యే అవకాశం తక్కువ. బంగారం కొనుగోలుకు అనుకూల సమయం. పెట్టుబడులు లాభదాయక ఫలితాలను ఇస్తాయి. బంగారం, భూములపై ఇన్వెస్ట్‌మెంట్‌కు మంచి రోజు. విద్యార్థులకు శుభకాలం. ఆవులకు ఆహారం పెట్టడం శుభాన్ని కలిగిస్తుంది. వినాయకుని ఆలయానికి వెళ్లండి, పనులు సాఫీగా జరుగుతాయి. లక్కీ నెంబర్: 5

సింహ రాశి: ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంది. ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలకు అద్భుతమైన రోజు. విద్యార్థులకు అనుకూలం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. స్పెక్యులేషన్‌లో పెట్టుబడులు పెట్టవద్దు. పెట్టుబడులకు మంచి రోజు. ముఖ్యమైన చర్చల్లో జాగరూకత అవసరం. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. లక్కీ నెంబర్: 6

కన్యా రాశి: గతంలో విఫలమైన పనులను మళ్లీ ప్రారంభించడానికి అనుకూల సమయం. ఆర్థికంగా సమయానికి డబ్బు అందుతుంది. కీర్తి, గౌరవం పెరుగుతాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనే అవకాశం. ఉద్యోగస్తులు వాగ్వివాదాలకు దూరంగా ఉండి, తమ పనిపై దృష్టి పెట్టాలి. అమ్మవారి దర్శనం అదృష్టాన్ని తెస్తుంది. వీలైతే ఆకుపచ్చ దుస్తులు ధరించండి, ఇది రోజును మరింత అనుకూలం చేస్తుంది. లక్కీ నెంబర్: 3

తులా రాశి: కొత్త పనులు ప్రారంభించే ముందు భాగస్వామి సలహా తీసుకోండి. ఆర్థికంగా లాభాలు సాధిస్తారు. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు. భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. అనవసర ఖర్చులను నియంత్రించండి. పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. వీలైతే నవగ్రహ ప్రదక్షిణ చేసి, శివుడి దర్శనం చేసుకోండి. లక్కీ నెంబర్: 6

వృశ్చిక రాశి: అనవసర ఖర్చులు, వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడే సమయం. స్త్రీలకు ఆభరణ యోగం. పెట్టుబడులకు అనుకూల రోజు. భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిత్య సుబ్రహ్మణ్య ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. లక్కీ నెంబర్: 7

ధనుస్సు రాశి: చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న బాకీలు, బిల్లులు వసూలవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. పనిలో ఏకాగ్రత, అంకితభావం పెంచుకోండి. బ్యాంకు ఉద్యోగులు, ఆర్థిక లావాదేవీలు చేసేవారు చెల్లింపులను జాగ్రత్తగా తనిఖీ చేయండి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. వీలైతే విష్ణు సహస్రనామం లేదా “ఓం నమో నారాయణ” మంత్రాన్ని 108 సార్లు జపించండి. లక్కీ నెంబర్: 6

మకర రాశి: ఈ రోజు “ధైర్యే సాహసే లక్ష్మీ” అనే సూక్తి మీకు వర్తిస్తుంది. శని దేవుడి శుభ దృష్టి ఉంది, ఏ పని చేసినా విజయం సాధ్యం. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు అనుకూలం. కాంట్రాక్టర్లు, ఇనుప, టైర్ వ్యాపారస్తులకు శుభ దినం. శివారాధన మంచి ఫలితాలను ఇస్తుంది. వీలైతే శివాలయానికి వెళ్లండి లేదా “ఓం నమశ్శివాయ” మంత్రాన్ని 108 సార్లు జపించండి. లక్కీ నెంబర్: 11

కుంభ రాశి: స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ, వృత్తి ప్రయత్నాలకు, ప్రమోషన్‌లకు అనుకూల సమయం. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై కొంచెం జాగ్రత్త అవసరం. భార్యతో అనవసర వివాదాలు పెట్టుకోవద్దు. పెద్దలకు గౌరవం ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు కనిపిస్తాయి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. పెద్దలకు కీళ్ల సమస్యలు రావచ్చు. శివారాధన మంచి ఫలితాలను ఇస్తుంది. లక్కీ నెంబర్: 10

మీన రాశి: ఈ రోజు అనుకూల దినం. పెద్దల సలహా తీసుకోండి. శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. భాగస్వామికి కానుకలు కొనడానికి అనుకూల సమయం. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. భూ సంబంధిత లావాదేవీలకు మంచి రోజు. డాకుమెంట్లపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. భాగస్వామి సలహాతో ముందుకు సాగండి. అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. లక్కీ నెంబర్: 9

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ