Business

AP Mega DSc : మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ప్రైమరీ కీ విడుదల..

AP Mega DSc : మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ప్రైమరీ కీ విడుదల.. ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఏపీ డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ముఖ్యమైన అప్డేట్‌ను వెల్లడించారు.

మెగా డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్‌ షీట్‌లను ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://apdsc.apcfss.inలో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, జులై 11, 2025లోగా అదే వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించాలని ఆయన సూచించారు.

ఈ మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 2, 2025 వరకు 23 రోజుల పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా నిర్వహించబడ్డాయని కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 92.90 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు ఆయన వెల్లడించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."