Beauty Tips

Face Glow Tips: రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే.. ముఖం తెల్లగా మెరిసిపోతుంది..

Face Glow Tips: రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే.. ముఖం తెల్లగా మెరిసిపోతుంది.. ఆయుర్వేదం ప్రకారం, కొన్ని సుగంధ ద్రవ్యాలను తీసుకోవడం వల్ల సహజంగా అందంగా కనిపించవచ్చు. ఇవి ముఖంపై ముడతలు రాకుండా నిరోధించడంలో సహాయపడతాయి.

అందంగా కనిపించాలని కోరుకోని వారు ఎవరైనా ఉంటారా? వయసుతో సంబంధం లేకుండా యవ్వనంగా, ఆకర్షణీయంగా కనిపించాలని అందరూ ఆశిస్తారు. దీని కోసం చాలా మంది ఖరీదైన క్రీములు, లోషన్లు వాడుతుంటారు.

అయితే, కొన్ని సాధారణ డ్రింక్స్‌ను రోజూ తాగడం ద్వారా ముఖంలో సహజమైన గ్లో వస్తుంది, యవ్వనంగా కనిపించవచ్చు. ఆయుర్వేదం సూచించే కొన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం వల్ల అందం పెరుగుతుంది, ముడతలు రాకుండా ఆపవచ్చు. అవేంటి? వాటిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం…

1. దాల్చిన చెక్క నీరు: రాత్రి నిద్రించే ముందు దాల్చిన చెక్క నీరు తాగితే శరీరంలోని విష పదార్థాలు (టాక్సిన్స్) బయటకు పోతాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్స్, ఫాలీ ఫినాల్స్‌ను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చర్మ సమస్యలను తగ్గించి, ముఖానికి సహజమైన అందాన్ని, గ్లోను అందిస్తుంది.

2. మెంతుల నీరు: రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు మెంతుల నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరియు శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. ఊబకాయం సమస్య తగ్గుతుంది. అంతేకాదు, ఇది సహజమైన యవ్వనాన్ని, అందాన్ని కాపాడుతుంది.

3. జీలకర్ర నీరు: జీలకర్ర నీరు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. జీలకర్రలో సహజ జీర్ణ లక్షణాలు ఉన్నాయి, ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. రోజూ జీలకర్ర నీరు తాగితే, మెదడు పనితీరు మెరుగవుతుంది మరియు చర్మంలో సహజమైన మార్పులు కనిపిస్తాయి.

4. సోంపు నీరు: సోంపు గింజలను నీటిలో మరిగించి, వడకట్టి తాగడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది కడుపును చల్లబరుస్తుంది, మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది మరియు ముఖంలో సహజమైన గ్లోను తెస్తుంది. సోంపు గింజలను నీటిలో కొంత సమయం నానబెట్టి, ఆ నీటిని వడకట్టి తాగాలి.

ఈ సాధారణ ఆయుర్వేద డ్రింక్స్‌ను రోజూ తీసుకోవడం వల్ల సహజమైన అందం, యవ్వనం, ఆరోగ్యం సొంతం అవుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."