Devotional

Tirumala: తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకునే అవకాశం… ఇలా చేస్తే చాలా సులభం..

Tirumala:కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. స్వామి వారి దివ్య రూపాన్ని ఒక్క క్షణం చూసేందుకు గంటల తరబడి ప్రయాణించి తిరుమలకు చేరుకుంటారు. చాలా మంది భక్తులు స్వామిని సమీపంగా దర్శించుకోవాలని ఆశపడతారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో “మొదటి గడప” అనేది అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటి. సాధారణంగా రూ. 300 ప్రత్యేక టికెట్లు, సర్వదర్శనం ద్వారా వచ్చే భక్తులు దూరం నుంచి మాత్రమే స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు జరుగుతాయి. అయితే, వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి టికెట్లు, ఇతర ప్రత్యేక దర్శన టికెట్లు కలిగిన వారికి మొదటి గడప నుంచి స్వామి దర్శనం లభిస్తుంది.

ఈ అవకాశం కేవలం సెలబ్రిటీలు లేదా ఎక్కువ ధర చెల్లించి టికెట్లు కొనుగోలు చేసేవారికి మాత్రమే కాకుండా, సామాన్య భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లను అందిస్తోంది. ఈ టికెట్లు ఏ రోజుల్లో అందుబాటులో ఉంటాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి గడప దర్శన టికెట్ల వివరాలు:
ప్రతి నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మొదటి గడప దర్శనం కోసం టికెట్లు జారీ చేస్తారు. ఈ టికెట్ల కోసం లక్కీ డిప్‌లో పేరు నమోదు చేసుకోవాలి. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన పేర్లను ప్రకటిస్తారు. అయితే, ఈ లక్కీ డిప్‌కు చాలా పోటీ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్‌ను రెండు నెలల ముందుగానే చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ:

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో టీటీడీ దేవస్థానం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

మీ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి.

హోం పేజీలో కనిపించే “పిలిగ్రిమ్ సర్వీస్”లో “వ్యూ ఆల్” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

అందులో కనిపించే “Seva eDip” ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ పూర్తి వివరాలతో పాటు ఫొటో ఐడీ ప్రూఫ్ అందించండి. ఈ టికెట్ కోసం గరిష్టంగా ఇద్దరు వ్యక్తులను ఎంచుకోవచ్చు.

వివరాలు పూర్తి చేసిన తర్వాత “కంటిన్యూ” బటన్‌పై క్లిక్ చేయండి.

తర్వాత కనిపించే “షో సెలక్టెడ్ సేవ అండ్ డేట్” ఆప్షన్‌ను ఎంచుకోండి.

“సెలక్ట్ ఆల్ సేవ డేట్స్” ఆప్షన్‌ను ఎంచుకుని, “కంటిన్యూ”పై క్లిక్ చేయండి.

చివరగా, మీరు అందించిన సమాచారాన్ని ఒకసారి సమీక్షించి “సబ్‌మిట్” బటన్‌పై క్లిక్ చేయండి.

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత:
రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయితే, “రిజిస్ట్రేషన్ సక్సెస్” అనే అలర్ట్‌తో ఒక రిజిస్ట్రేషన్ ఐడీ జనరేట్ అవుతుంది. లక్కీ డిప్‌లో ఎంపికైన వారి వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారో స్క్రీన్‌పై చూపిస్తారు. “టైమ్ టు లెఫ్ట్ ఫర్ డ్రా” అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు సేవకు ఎంపికైతే, మీ రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది.