Today Horoscope:జూలై 11 శుక్రవారం రాశి ఫలాలు.. ఈ రాశులపై లక్ష్మి కటాక్షం..మీ రాశి ఉందా..?
Today Horoscope:జూలై 11 శుక్రవారం రాశి ఫలాలు.. ఈ రాశులపై లక్ష్మి కటాక్షం..మీ రాశి ఉందా..నేడు జూలై 11 శుక్రవారం… చాంద్రమానాన్ని అనుసరించి ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో ఈనాటి దినఫలాల్లో తెలుసుకుందాము…
నేడు జూలై 11, 2025, శుక్రవారం, ఆషాఢ మాసం, తిథి పాడ్యమి (రాత్రి 2:02 వరకు), తర్వాత విదియ. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 6:37 వరకు, ఆ తర్వాత ఉత్తరాషాఢ. ఈ రోజు వర్జ్యం మధ్యాహ్నం 2:09 నుండి సాయంత్రం 3:48 వరకు. ఐదు రాశులపై కుజ, గురుల శుభ దృష్టి వల్ల వారికి అనుకోని శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. చాంద్రమానం ఆధారంగా ద్వాదశ రాశులకు ఈ రోజు ఫలితాలు ఇలా ఉన్నాయి:
మేషం
వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. రావలసిన డబ్బులు అందడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు లభిస్తాయి. కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనం చేస్తారు. ఆఫీసు విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవద్దు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం
పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి. ఇల్లు కొనుగోలు కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. పనులను నెమ్మదిగా, జాగ్రత్తగా పూర్తి చేయండి. కుటుంబ సభ్యులతో శుభ కార్యంలో పాల్గొంటారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. ఆరోగ్యం కొంత మెరుగవుతుంది. బంధువులతో చిన్నపాటి సమస్యలు రావొచ్చు.
మిథునం
కెరీర్లో పురోగతి ఉంటుంది. ఆఫీసులో అనవసర వివాదాలు, రాజకీయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. విదేశీ ప్రయాణాల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోండి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.
కర్కాటకం
ఈ రోజు పనులను వాయిదా వేయకండి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనం చేస్తారు. సహనంతో ఉండడం అవసరం. వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సహకారం లభిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు.
సింహం
ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. మీ మాట, తీరుతో సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. లక్ష్యాల కోసం కృషి చేయండి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు తొలగిపోతాయి. దూర ప్రయాణాల్లో చిన్న ఇబ్బందులు రావొచ్చు. ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన ఉంటుంది.
కన్య
భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగంలో అడ్డంకులు ఎదురవుతాయి. వ్యాపార లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. పట్టుదలతో లక్ష్యం వైపు ముందుకు సాగండి. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
తుల
డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి. కొన్ని ప్రతికూల వార్తలు వినవచ్చు. సహోద్యోగులతో విభేదాలు రావొచ్చు. వ్యాపారంలో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ఇతరుల పనులతో పాటు మీ పనులపై దృష్టి పెట్టండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో శుభవార్త వింటారు.
వృశ్చికం
ఖర్చులను నియంత్రించండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. డబ్బు ఆదా చేస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. జీవిత భాగస్వామితో సమయం గడపడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. స్త్రీలు వ్యాపారం ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలం. ప్రాపర్టీ కొనుగోలులో సలహాలు తీసుకోండి.
ధనుస్సు
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో అవకాశాలను జారవిడవకండి. ఉద్యోగంలో సమస్యలను మనసుకు తీసుకోవద్దు. ముఖ్య నిర్ణయాల్లో శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కళారంగంలో వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. బంధువులతో ఆస్తి వివాదాలు తగ్గుతాయి. కొత్త వస్తువులు కొంటారు.
మకరం
డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు పనిలో సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు ఈ రోజు కొంత ప్రతికూలం. మహిళలకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఆహార అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. అతిథుల రాకతో ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ ఆలోచనలు ఇతరులకు ఇబ్బందిగా అనిపించవచ్చు. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.
కుంభం
అనవసర ఖర్చులను తగ్గించండి. రాజకీయాల్లో ఉన్నవారు మంచి పేరు సంపాదిస్తారు. కీలక విషయాల్లో పెద్దల సలహా తీసుకోండి. శుభవార్తలు వింటారు. మనోబలం పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. లక్ష్యం కోసం కృషి చేయండి, విజయం సిద్ధిస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
మీనం
ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. పెట్టుబడులు ఫలిస్తాయి. దగ్గరి వ్యక్తులతో వివాదాలు పెట్టుకోవద్దు. శుభవార్త వల్ల కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. వ్యాపారం కోసం విదేశీ ప్రయాణాలు చేయవచ్చు. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆవుపాలతో చేసిన చక్కెర పొంగలిని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

