Stocks to Watch: జూలై 11వ తేదీ శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్..
Stocks to Watch: జూలై 11వ తేదీ శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్.. ఈ రోజు, జూలై 11, 2025, శుక్రవారం, స్టాక్ మార్కెట్లో క్రింద పేర్కొన్న కంపెనీల షేర్లు వార్తల్లో నిలిచాయి. ఈ స్టాక్స్ వార్తల్లో ఉండడానికి ప్రధాన కారణం ఆయా కంపెనీల పనితీరు లేదా వాటిలో జరిగిన ముఖ్యమైన పరిణామాలు. ఈ అంశాల ప్రభావంతో ఈ రోజు ట్రేడింగ్‌లో ఈ షేర్లు గణనీయమైన కదలికలను చూపించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ స్టాక్స్‌పై దృష్టి పెట్టడం మంచిది.
Hindustan Unilever: కంపెనీ నూతన సీఈఓగా ప్రియా నాయర్ ఆగస్టు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ప్రస్తుత సీఈఓ రోహిత్ జావా జూలై 31తో రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది.
Glenmark Pharmaceuticals: అమెరికాకు చెందిన AbbVie సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ISB 2001 ఔషధాన్ని AbbVieకు సరఫరా చేయనుంది. ఈ ఒప్పందం విలువ సుమారు 5,800 కోట్ల రూపాయలు.
Aegis Logistics: గుజరాత్‌లోని పిపావావ్లో ఉన్న కంపెనీ యొక్క ఎల్పీజీ గ్యాస్ స్టోరేజ్ టెర్మినల్‌ను 428 కోట్ల రూపాయలకు విక్రయించింది.
SBI Cards and Payment Services: కంపెనీ చీఫ్ రిస్క్ ఆఫీసర్ 2025 అక్టోబర్ 6న వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయనున్నారు.
JB Chemicals & Pharmaceuticals: రిచా అరోరాను కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించినట్లు స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది.
Centrum Capital: ఈ నెల 15న బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అదనపు షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణపై చర్చించనున్నారు.
AiroLam: వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ భాగంగా అమెరికా, పోలాండ్, దుబాయ్ వంటి దేశాల్లో కొత్త శాఖలను ప్రారంభించనుంది.
Aspira Pathlab & Diagnostics: కంపెనీ ఎండి మరియు సీఈఓ పంకజ్ షా నియామకాన్ని మరో మూడేళ్లపాటు పొడిగించారు. ఈ నియామకం ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుంది.
డిస్క్లైమర్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించకూడదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ మరియు ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీ పెట్టుబడుల లాభనష్టాలకు chaipakodi బాధ్యత వహించదు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలని chaipakodi సూచిస్తుంది.

