DevotionalToday Rasi Phalalu In telugu

Rasi Phalalu:జూలై 14 సోమవారం రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ ఖర్చులు ఎక్కువ..

Telugu RAsi Phalalu:నేడు జూలై 14, 2025, సోమవారం, ఆషాడ మాసం, చవితి తిథి (రాత్రి 11:57 వరకు, తర్వాత పంచమి), ధనిష్ఠ నక్షత్రం (ఉదయం 6:40 వరకు, తర్వాత శతభిషం). వర్జ్యం: ఉదయం 1:54 నుండి మధ్యాహ్నం 3:28 వరకు. చంద్రుని శుభ దృష్టి వల్ల ఆరు రాశులకు అనుకోని శుభ ఫలితాలు సంభవించవచ్చు.

మేషం: ఒడిదుడుకులతో రోజు ప్రారంభం. వ్యాపారులకు పెద్ద ఆఫర్లు, స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. కుటుంబ ఆందోళనలు కొనసాగవచ్చు. కొత్త పనులు, ఇల్లు కొనుగోలుకు అనుకూల సమయం.

వృషభం: లాభదాయకమైన రోజు. వ్యాపారంలో అడ్డంకులు తొలగి, భాగస్వామ్య అవకాశాలు. ఉద్యోగంలో ప్రమోషన్, కుటుంబంలో శుభకార్యాలు, పెండింగ్ పనులు పూర్తి. మనశ్శాంతి లభిస్తుంది.

మిథునం: ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది. సుదీర్ఘ ప్రయాణ ప్రణాళికలు, కుటుంబానికి దూరమయ్యే అవకాశం. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా ఉండవచ్చు. ఉద్యోగంలో ప్రశంసలు, వ్యాపారం సాధారణం.

కర్కాటకం: అనుకూల రోజు. కొత్త పనుల్లో విజయం, ఆర్థిక లాభాలు. కుటుంబంలో శుభకార్యాలు, పాత ఆస్తి వివాదాలు సమసిపోతాయి. రహస్యాలు ఎవరితోనూ పంచుకోవద్దు.

సింహం: మిశ్రమ ఫలితాలు. కుటుంబ కలహాలు, విబేధాలు తొలగుతాయి. కొత్త పనులకు ప్రణాళిక, ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం.

కన్య: దైవానుగ్రహం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు రావచ్చు, మాటలు నియంత్రించండి. వ్యాపారం సాధారణం, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు సంభవించవచ్చు. పెద్ద నిర్ణయాలు ఆపండి.

తుల: వ్యాపారంలో లాభదాయక అవకాశాలు. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రయోజనాలు, కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు. కుటుంబంలో సంతోషం, దాంపత్య ప్రేమ పెరుగుతుంది.

వృశ్చికం: లాభదాయక రోజు. ఉద్యోగంలో ముఖ్య నిర్ణయాలు, దూర ప్రయాణాల వల్ల అలసట. ఆర్థిక లాభాలు ఉంటాయి.

ధనస్సు: ఒడిదుడుకుల రోజు. పూర్వీక ఆస్తి వివాదాలు రావచ్చు, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. డ్రైవింగ్‌లో జాగ్రత్త.

మకరం: అనుకూల రోజు. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం, స్నేహితుల నుండి ఆర్థిక లాభాలు. ఉద్యోగంలో స్వల్ప సమస్యలు.

కుంభం: మనోవాంఛలు నెరవేరతాయి. వ్యాపారంలో కొత్త మార్పులు, లాభాలు, ప్రమోషన్ అవకాశాలు. కుటుంబ ఒత్తిడులు తొలగుతాయి. కొత్త పనులకు అనుకూల సమయం.

మీనం: భూమి సంబంధిత లాభాలు. పూర్వీక ఆస్తిలో హక్కులు, కుటుంబంలో శుభకార్యాలు. కార్యాలయంలో మార్పులు, దగ్గరి వారితో జాగ్రత్త.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."