Business

Bitcoin: పావలా నుంచి రూ. 1 కోటి వరకూ బిట్ కాయిన్ ప్రస్థానం ఎలా సాగిందో ఒక లుక్ వేయండి..

Bitcoin: పావలా నుంచి రూ. 1 కోటి వరకూ బిట్ కాయిన్ ప్రస్థానం ఎలా సాగిందో ఒక లుక్ వేయండి.. బిట్‌కాయిన్ ధర రూ. 1 కోటిని అధిగమించి, ప్రస్తుతం రూ. 1.04 కోట్ల వద్ద ఉంది. ఈ పెరుగుదల క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టినవారికి బిట్‌కాయిన్‌ను బంగారు బాతుగా మార్చింది. గత 15 సంవత్సరాల్లో బిట్‌కాయిన్ రికార్డు స్థాయిలో పెరిగింది, చరిత్రలో తొలిసారిగా రూ. 1 కోటిని దాటి ముందుకు సాగుతోంది.

ఈ క్రిప్టో కరెన్సీ దాని పెట్టుబడిదారులను కోటీశ్వరులుగా మార్చింది, ఇది ఒక చారిత్రాత్మక సందర్భంగా చెప్పవచ్చు. గత కొంతకాలంగా బిట్‌కాయిన్ అసాధారణ రాబడిని అందిస్తోంది. 2010లో ఒక బిట్‌కాయిన్ ధర కేవలం 0.3 సెంట్లు (రూ. 0.25 పైసలు)గా ఉండగా, ఇప్పుడు అది రూ. 1 కోటిని దాటడం విశేషం. ఒకప్పుడు పిజ్జా కొనుగోలుకు ఉపయోగించిన బిట్‌కాయిన్ ఇప్పుడు కోటీశ్వరులను సృష్టించే ఆస్తిగా మారింది.

బిట్‌కాయిన్ దూకుడుతో ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా గణనీయంగా పెరిగాయి. పెట్టుబడిదారులు బిట్‌కాయిన్‌ను బంగారం తర్వాత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు, ఇది దాని ధర పెరుగుదలకు ఒక కారణం. గత 15 సంవత్సరాల బిట్‌కాయిన్ ధర పెరుగుదలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు:

2010: 0.3 సెంట్లు (రూ. 0.25)
2011: 30 డాలర్లు (రూ. 2,580)
2012: 13.45 డాలర్లు (రూ. 1,156)
2013: 1,163 డాలర్లు (రూ. 99,018)
2014: 751 డాలర్లు (రూ. 64,586)
2015: 963 డాలర్లు (రూ. 82,818)
2016: 1,156 డాలర్లు (రూ. 99,416)
2017: 19,783 డాలర్లు (రూ. 17,01,338)
2018: 14,156 డాలర్లు (రూ. 12,17,416)
2019: 13,659 డాలర్లు (రూ. 11,74,274)
2020: 28,949 డాలర్లు (రూ. 24,89,614)
2021: 69,000 డాలర్లు (రూ. 59,34,000)
2022: 47,686 డాలర్లు (రూ. 41,01,016)
2023: 43,196 డాలర్లు (రూ. 37,14,856)
2024: 103,332 డాలర్లు (రూ. 88,86,552)
2025 (జూలై 14 నాటికి): 123,153 డాలర్లు (రూ. 1,05,91,158)

గత మూడేళ్లలో బిట్‌కాయిన్ ధర మూడు రెట్లు పెరిగింది. 2016 తర్వాత దాని దూకుడు మొదలై, 2017 నాటికి ధర 1,100 డాలర్ల నుంచి 19,000 డాలర్లకు చేరింది. 2023లో పతనం ఎదురైనప్పటికీ, గత రెండేళ్లలో బిట్‌కాయిన్ భారీగా పుంజుకుంది.

Disclaimer: ఈ సమాచారం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించరాదు. క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులు లాభనష్టాలకు లోబడి ఉంటాయి. మీ పెట్టుబడుల నష్టాలకు chaipakodi బాధ్యత వహించదు.