Business

AP news:ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్… జాబ్స్ నోటిఫికేషన్ విడుదల..

AP news:ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్… జాబ్స్ నోటిఫికేషన్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు సంతోషకరమైన వార్త అందించింది. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లో జనరల్/లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద 691 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. మెరిట్ స్పోర్ట్స్ కోటాతో సహా మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. అర్హత వివరాలను http://psc.ap.gov.inలో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల భర్తీ స్పోర్ట్స్ కోటా, ఎస్సీ వర్గీకరణ ఆధారంగా జరుగుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."