DevotionalToday Rasi Phalalu In telugu

Daily Horoscope:21 జూలై సోమవారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారికీ ధనయోగం..

Daily Horoscope:21 జూలై సోమవారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారికీ ధనయోగం.. నేడు జూలై 21, 2025, సోమవారం, ఆషాఢ మాసం, ఏకాదశి తిథి (ఉదయం 09:39 వరకు), తరువాత ద్వాదశి, రోహిణి నక్షత్రం (రాత్రి 09:39 వరకు), తరువాత మృగశిర. వర్జ్యం: రాత్రి 02:19 నుండి తెల్లవారుజాము 03:48 వరకు. నీడు 6 రాశులపై చంద్రుడి శుభ దృష్టి వల్ల అనుకోని శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. చాంద్రమానం ప్రకారం ద్వాదశ రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి:

మేషం:
చంద్ర బలం తక్కువగా ఉంది. వ్యాపారులు, ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు, వాగ్వివాదాలు తలెత్తే అవకాశం. ఒక వ్యక్తి వల్ల ఇబ్బందులు రావచ్చు. ఒత్తిడికి లోనవొద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శివారాధన శుభం.
లక్కీ కలర్: లేత నీలం
లక్కీ నెంబర్: 7

వృషభం:
చంద్రుడి శుభ దృష్టి ఉంది. శుభవార్తలు, వ్యాపారంలో కొత్త ఆలోచనలు, ఆర్థిక లాభాలు ఉన్నాయి. విందు-వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ అవకాశాలు విజయవంతం. శని వక్రగతి వల్ల శుభం. రియల్ ఎస్టేట్‌లో అగ్రిమెంట్లకు అనుకూలం. విద్యార్థులకు మంచి రోజు. గణపతి ఆరాధన, గరిక సమర్పణ శుభం.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 3

మిథునం:
బుధ, శని, చంద్రుల వ్యతిరేక దృష్టి వల్ల చిక్కులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. ఖర్చులు, ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఉద్యోగులు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సహస్రనామం చదవండి.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 9

కర్కాటకం:
చంద్రుడి శుభ దృష్టి ఉంది. వృత్తి, వ్యాపారంలో విజయం. బుధ వక్ర ప్రభావం వల్ల మధ్యాహ్నం నుండి పనులు నిదానంగా సాగవచ్చు. ఉద్యోగులకు అధికారుల మన్ననలు. హనుమంతుడికి ఆకు పూజ, సింధూర బొట్టు శుభం.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 6

సింహం:
గ్రహబలం తక్కువగా ఉంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వాహన డ్రైవింగ్‌లో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్లకు దూరంగా ఉండండి. విద్యార్థులకు సామాన్యం. దుర్గాదేవికి కుంకుమ పూజ శుభం.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 9

కన్య:
శని ఏడవ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారం నిదానంగా సాగుతుంది. ఖర్చులు, ఆరోగ్యం, ఉద్యోగులకు అధికారులతో ఇబ్బందులు, పిల్లల విషయంలో జాగ్రత్త. వాహన డ్రైవింగ్‌లో అప్రమత్తం. శివాలయ దర్శనం శుభం.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 1

తుల:
శని వక్ర దృష్టి, చంద్ర బలం తక్కువ. పనుల్లో జాప్యం, ఆందోళన. కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం, విద్యార్థులకు అనుకూలం కాదు. శివారాధన ఇబ్బందులు తొలగిస్తుంది.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 5

వృశ్చికం:
గ్రహబలం అనుకూలం. పనులు నెరవేరుతాయి. విందు-వినోదాలు, వ్యాపారంలో ధనలాభం. మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వారికి శుభం. గణపతి ఆరాధన మంచి చేస్తుంది.
లక్కీ కలర్: గులాబీ
లక్కీ నెంబర్: 6

ధనస్సు:
చంద్ర బలం అనుకూలం. వ్యాపారంలో విజయం, కొత్త నిర్ణయాలు. ధనలాభం. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు, విద్యార్థులకు శుభం. సీతారాముల దర్శనం విజయం తెస్తుంది.
లక్కీ కలర్: లేత కాషాయం
లక్కీ నెంబర్: 5

మకరం:
గ్రహబలం అనుకూలం కాదు. కొత్త నిర్ణయాలకు దూరంగా ఉండండి. వ్యాపారులకు ధన నష్టం, శత్రువులతో జాగ్రత్త. మౌనం శ్రేయస్కరం. శివుడికి ఆవు పాలు సమర్పణ ఇబ్బందులు తొలగిస్తుంది.
లక్కీ కలర్: లేత వంకాయ
లక్కీ నెంబర్: 4

కుంభం:
చంద్ర బలం అనుకూలం. పనుల్లో విజయం, సమాజంలో గౌరవం. వ్యాపారులకు ధనలాభం, కొత్త ప్రాజెక్టులకు శుభం. కుటుంబంతో సంతోష సమయం. సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం శుభం.
లక్కీ కలర్: బంగారు వర్ణం
లక్కీ నెంబర్: 5

మీనం:
చంద్ర బలం తక్కువ, శని వక్ర దృష్టి వల్ల పనుల్లో జాప్యం. వ్యాపారులకు, కొత్త నిర్ణయాలకు అనుకూలం కాదు. ఆడంబర ఖర్చులు. ఉద్యోగ మార్పు ప్రయత్నాలకు శుభం. విద్యార్థులకు సామాన్యం.
లక్కీ కలర్: గోధుమ రంగు
లక్కీ నెంబర్: 3

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."