Tirumala Update:తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్…
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య హెచ్చరిక… తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలోకి నేటి నుంచి ఒక నెల పాటు భక్తులను అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ విషయంపై టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
శ్రీవారి ఆలయం సమీపంలోని పవిత్రమైన స్వామి పుష్కరిణిలో మరమ్మతు పనులను జూలై 20, 2025 నుంచి ఆగస్టు 19, 2025 వరకు చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రతి ఏటా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్కరిణి మరమ్మతు పనులు నిర్వహిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది.
ఈ ఏడాది సెప్టెంబరు 24, 2025 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులను నెల రోజుల ముందుగానే పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ సమయంలో పుష్కరిణి హారతి ఉండదని, అలాగే భక్తులను పుష్కరిణిలోకి అనుమతించబోమని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని గమనించి, భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఇక, తిరుమలలో సెప్టెంబరు 24, 2025 నుంచి అక్టోబరు 2, 2025 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి విభాగాధిపతులను ఆదేశించారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వివరాలు:
16-09-2025: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
23-09-2025: బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
24-09-2025: ధ్వజారోహణం.
28-09-2025: గరుడ వాహనం.
01-10-2025: రథోత్సవం.
02-10-2025: చక్రస్నానం.
వాహన సేవలు: ప్రతిరోజూ ఉదయం 8:00 నుంచి 10:00 గంటల వరకు, సాయంత్రం 7:00 నుంచి 9:00 గంటల వరకు.
బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతల దర్శనాలు కూడా రద్దు.
విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్ మ్యాప్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశం.
దర్శన క్యూలైన్లు, మాడ వీధుల గ్యాలరీలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని ఆదేశం.
ఇంజనీరింగ్ పనులను భక్తుల అవసరాలకు అనుగుణంగా చేపట్టాలని ఆదేశం.
గ్యాలరీలలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశం.
విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశం.
శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి, భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశం.
27-09-2025 రాత్రి 9:00 గంటల నుంచి 29-09-2025 ఉదయం 6:00 గంటల వరకు: తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరణ.
భక్తుల రద్దీకి తగ్గట్టుగా లడ్డూల నిల్వలను సిద్ధం చేయాలని ఆదేశం.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

