Business

Credit card: క్రెడిట్ కార్డు విషయంలో ఈ 6 రకాల తప్పులు అస్సలు చేయకండి!

Credit card: క్రెడిట్ కార్డు విషయంలో ఈ 6 రకాల తప్పులు అస్సలు చేయకండి.. తక్కువ ఆదాయం ఉన్నవారు నెలవారీ ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు ఒక సర్వేలో తేలింది. అయితే, క్రెడిట్ కార్డు వినియోగదారులు చేసే చిన్నపాటి తప్పిదాలు క్రెడిట్ స్కోర్‌ను తగ్గించవచ్చు. క్రెడిట్ కార్డు వాడేవారు తప్పనిసరిగా నివారించాల్సిన కొన్ని తప్పిదాల గురించి తెలుసుకుందాం!

మినిమమ్ డ్యూ (Minimum Due) చెల్లించడం
చాలామంది క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ తప్పు చేస్తుంటారు. క్రెడిట్ కార్డు బిల్లులో కనీస బకాయి (Minimum Due) చెల్లించడం వల్ల అధిక వడ్డీ, ఎక్కువ కాలం అప్పు ఉండిపోతుంది. అదనపు ఛార్జీలను నివారించాలంటే, మొత్తం బిల్లును ఒకేసారి చెల్లించడం ఉత్తమం.

అవసరానికి మించి క్రెడిట్ కార్డులు తీసుకోవడం
బహుళ క్రెడిట్ కార్డులను వాడటం, వాటి ఖర్చులపై నియంత్రణ లేకపోవడం వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. అవసరానికి తగిన క్రెడిట్ కార్డులను మాత్రమే తీసుకొని, సకాలంలో చెల్లింపులు చేయడం ఉత్తమం.

హిడెన్ ఛార్జీలను పట్టించుకోకపోవడం
క్రెడిట్ కార్డులకు వార్షిక ఫీజులు, నగదు ఉపసంహరణ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి నెల మీ క్రెడిట్ కార్డు బిల్లును జాగ్రత్తగా పరిశీలించి, ఇటువంటి ఛార్జీలను తగ్గించుకోవడం మంచిది.

రివార్డ్ పాయింట్ల కోసం అతిగా వాడటం
రివార్డ్ పాయింట్ల కోసం క్రెడిట్ కార్డును అతిగా వాడటం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఇది క్రెడిట్ యుటవైలేషన్ రేషియోను దాటేలా చేసి, క్రెడిట్ స్కోర్‌ను తగ్గించవచ్చు.

పేమెంట్ మిస్ చేయడం
క్రెడిట్ కార్డు వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సకాలంలో చెల్లింపులు చేయాలి. ఆలస్య చెల్లింపుల వల్ల అదనపు ఛార్జీలు, అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది, మరియు ఇది క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పేమెంట్ మిస్ కాకుండా ఉండాలంటే ఆటో-పే ఆప్షన్‌ను ఎనేబుల్ చేయడం మంచిది.

రివార్డ్ పాయింట్ల వినియోగం
క్రెడిట్ కార్డుల ద్వారా లభించే రివార్డ్ పాయింట్లను సకాలంలో వినియోగించుకోవాలి. చాలామంది ఈ పాయింట్లను మర్చిపోతారు. రివార్డ్ పాయింట్ల ద్వారా ఖర్చులను కొంతమేరకు తగ్గించుకోవచ్చు.

​Disclaimer: పైన తెలిపిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ సలహాలను అమలు చేసే ముందు సంబంధిత ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి!