Zero Tax:జీరో టాక్స్ ఉన్న దేశాల గురించి తెలుసా? సంపాదించిన డబ్బులో ఒక్క రూపాయి కూడా పన్నుగా చెల్లించాల్సిన అవసరం లేదు..
Zero Tax:జీరో టాక్స్ ఉన్న దేశాల గురించి తెలుసా? సంపాదించిన డబ్బులో ఒక్క రూపాయి కూడా పన్నుగా చెల్లించాల్సిన అవసరం లేదు.. సాధారణంగా, ఒక నిర్దిష్ట పరిమితికి మించిన ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, లేదా వస్తువుల కొనుగోలు వంటి సందర్భాల్లో ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లించవలసి ఉంటుంది.
పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాకు ప్రధాన వనరుగా ఉంటుంది. అయినప్పటికీ, ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించనవసరం లేదు. ఈ దేశాల్లో ప్రజలు తమ సంపాదనపై ఎలాంటి వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించరు, అంటే వారు సంపాదించిన ప్రతి రూపాయి పూర్తిగా వారిదే!
జీరో టాక్స్ ఉన్న దేశాల గురించి తెలుసుకుందాం:
బహామాస్
అట్లాంటిక్ మహాసముద్రంలోని ద్వీప సమూహ దేశం, బహామాస్. ఇక్కడ 700కు పైగా ద్వీపాలు మరియు పగడపు దిబ్బలు ఉన్నాయి. ఈ దేశం తన పౌరులపై వ్యక్తిగత ఆదాయపు పన్ను విధించదు. అయితే, టాక్స్ ఫ్రీ సౌకర్యం పొందడానికి పౌరసత్వం తప్పనిసరి కాదు.
పనామా
మధ్య అమెరికాలో ఉన్న ఈ దేశంలో కూడా వ్యక్తిగత ఆదాయపు పన్ను లేదు. ఇక్కడి ప్రజలు తమ ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించరు.
కేమాన్ దీవులు
పశ్చిమ కరేబియన్ సముద్రంలోని బ్రిటీష్ ఓవర్సీస్ టెరిటరీ అయిన కేమాన్ దీవుల్లో కూడా ప్రజలు ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించరు. ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి పన్నులు విధించదు.
డొమినికా
వ్యక్తిగత ఆదాయపు పన్ను విధించని దేశాలలో డొమినికా ఒకటి. వ్యక్తిగత ఆదాయం లేదా కార్పోరేట్ ఆదాయం, ఏ విధంగా సంపాదించినా ఇక్కడ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
గల్ఫ్ దేశాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల్లో వ్యక్తిగత ఆదాయం లేదా జీతంపై ఎలాంటి పన్ను లేదు. ఈ దేశాలు చమురు, గ్యాస్ నిల్వలు, మరియు పర్యాటకం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. పరోక్ష పన్నుల విధానం వల్ల వీటి ఆర్థిక వ్యవస్థ బలంగా నడుస్తోంది.
బ్రూనై
ఆగ్నేయాసియాలోని ఈ ఇస్లామిక్ దేశంలో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, ఇవి దేశానికి భారీ ఆదాయాన్ని అందిస్తాయి. కాబట్టి, బ్రూనై ప్రభుత్వం ప్రజల నుంచి ఎలాంటి పన్నులు వసూలు చేయదు.
మొనాకో
ఐరోపాలోని ఒక చిన్న దేశం, మొనాకో. పర్యాటకం ద్వారా భారీ ఆదాయాన్ని పొందే ఈ దేశం ఆర్థికంగా చాలా బలంగా ఉంది. దీంతో, ఇక్కడి ప్రజలపై ఎలాంటి ప్రత్యక్ష పన్నులు విధించడం లేదు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

