PM Kisan Yojana:ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త… త్వరలో పీఎం కిసాన్ యోజన డబ్బులు అకౌంట్లలో జమయ్యే అవకాశం… అన్నదాత సుఖీభవతో డబుల్ బోనంజా!
PM Kisan Yojana:ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త… త్వరలో పీఎం కిసాన్ యోజన డబ్బులు అకౌంట్లలో జమయ్యే అవకాశం… అన్నదాత సుఖీభవతో డబుల్ బోనంజా.. పీఎం కిసాన్ 20వ విడత: ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతుల ఖాతాల్లో 14,000 రూపాయలు జమ చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద ఈ ఏడాది 6,000 రూపాయలు జమ చేయనుంది. దీంతో రైతుల ఖాతాల్లో సంవత్సరానికి మొత్తం 20,000 రూపాయలు జమ కానున్నాయి.
పీఎం కిసాన్ యోజన కింద ప్రతి ఏడాది మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ప్రతి విడతలో 2,000 రూపాయల చొప్పున ఈ నిధులు అందుతాయి. ఈ ఏడాది 19వ విడత డబ్బులు ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పుడు రెండో విడత డబ్బులు జూలైలో జమయ్యే అవకాశం ఉందని రైతులు ఆశిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో రెండో విడత డబ్బులు జమ కాగా, ఈ ఏడాది ఒక నెల ఆలస్యం అయింది.
ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో జూలై 18న డబ్బులు జమవుతాయని అందరూ భావించారు, కానీ అది జరగలేదు. అయితే, త్వరలోనే డబ్బులు జమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికార వర్గాలు కూడా ఈ నిధులు త్వరలో రైతుల ఖాతాల్లో జమవుతాయని సూచనలు ఇస్తున్నాయి.
రైతులు తమ e-KYC పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్‌ను లింక్ చేయడం ద్వారా డబ్బులు జమైన వెంటనే సమాచారం మొబైల్ ద్వారా అందుతుంది.
ఈ ఏడాది కేంద్రం నుంచి 6,000 రూపాయలు, రాష్ట్రం నుంచి 14,000 రూపాయలతో కలిపి మొత్తం 20,000 రూపాయలు రైతులకు లభించనున్నాయి. ఈ డబ్బులను రైతులు తమ ఇష్టానుసారం వ్యవసాయ ఖర్చులకు లేదా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ నిధులు రుణం లేదా సబ్సిడీ రూపంలో కాకుండా, ఆర్థిక సహాయంగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. మధ్యవర్తులు లేకుండా ఈ డబ్బులు రైతులకు అందుతాయి, ఇది ఈ పథకాల ప్రత్యేకత.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

