Devotional

Sravana Masam 2025:శ్రావణ మాసంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఏమిటి?

Sravana Masam 2025:హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది. తెలుగు సంవత్సరంలో ఐదవ నెలగా వచ్చే ఈ మాసం జులై 25 నుంచి ప్రారంభమవుతుంది.

శివుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవి ఈ మాసానికి అత్యంత ప్రీతికరమైనవారు. ఈ సమయంలో చేసే పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను అందిస్తాయని నమ్మకం. శ్రావణ మాసంలో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు, ఆచారాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

సాత్విక ఆహారం:
శ్రావణ మాసంలో మాంసాహారం, మద్యం, ధూమపానం పూర్తిగా నిషిద్ధం. ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలను కూడా తీసుకోకూడదు. శరీరం, మనస్సు శుద్ధి కోసం సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి. పాలు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటివి తీసుకోవడం ఉత్తమం.
దైవ భక్తి:
శ్రావణ మాసం దైవ చింతనకు ప్రసిద్ధం. ఈ మాసమంతా శివనామ స్మరణ, భగవన్నామ జపంతో గడపాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన, పూజలు చేయడం ద్వారా ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివునికి ప్రీతికరం. ఈ రోజులలో ఉపవాసం ఉండి, శివాలయాలను దర్శించి, అభిషేకాలు, బిల్వార్చనలు చేయడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చు.
వ్రతాలు, పూజలు:
శ్రావణ సోమవారాలు: శివలింగానికి నీరు, పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చక్కెర, గంధం, బిల్వ పత్రాలు, శమీ పత్రాలతో అభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. ‘ఓం నమః శివాయ’ జపం ఈ సమయంలో శ్రేష్ఠం.
మంగళ గౌరీ వ్రతం: శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. కొత్తగా వివాహమైన స్త్రీలు సుమంగళి యోగం కోసం ఈ వ్రతం చేస్తారు.
వరలక్ష్మీ వ్రతం: శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఇది అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం, సకల శుభాలను కలిగిస్తుందని నమ్ముతారు.
శ్రావణ శుక్రవారాలు: ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమార్చన, ఎర్రని పూలు, మల్లె మాలలు సమర్పించడం వల్ల రుణ విముక్తి, లక్ష్మీ కటాక్షం లభిస్తాయి.
చేయకూడని పనులు:
శరీరానికి నూనె రాసుకోకూడదు, కానీ నూనె దానం చేయడం శుభప్రదం.
క్షవరం (గుండు), గోర్లు కత్తిరించడం వంటివి నిషిద్ధం.
ఇతరులను బాధించడం, గొడవలు, హింసాత్మక చర్యలు పూర్తిగా మానాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
దానధర్మాలు:
ఈ పవిత్ర మాసంలో నిరుపేదలకు, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా పుణ్యం, దైవానుగ్రహం లభిస్తాయి.
శ్రావణ మాసం ఆధ్యాత్మిక సాధన, మనఃశాంతి, భగవంతుని అనుగ్రహం పొందడానికి అద్భుతమైన అవకాశం. ఈ నియమాలను పాటించడం ద్వారా శుభాలు, సంతోషం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."