Raksha Bandhan 2025: ఈసారి రాఖీ పౌర్ణమి ఎప్పుడొచ్చింది.. రాఖీ ఏ సమయంలో కట్టాలంటే..!
Raksha Bandhan 2025: ఈసారి రాఖీ పౌర్ణమి ఎప్పుడొచ్చింది.. రాఖీ ఏ సమయంలో కట్టాలంటే.. రక్షా బంధన్ పండుగను శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమకు సంకేతం. ఈ రోజున అక్కా చెల్లెళ్లు తమ సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి, అతని నుండి రక్షణ వాగ్దానం పొందుతారు.
ఈ సంవత్సరం రక్షా బంధన్‌ను ఆగస్టు 9న జరుపుకోనున్నారు. శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి శుభ ముహూర్తం గురించి తెలుసుకుందాం. శ్రావణ నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉండటం వల్ల తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రాఖీ కట్టడానికి శుభ సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
శ్రావణ మాసం వస్తే శుభ దినాలు వచ్చినట్టే. ఈ మాసంలో అనేక పండుగలు కూడా వస్తాయి. ఈ నెలలో అందరి కళ్లకు ఆనందం కలిగించే పండుగ రాఖీ పండుగ. అక్కా చెల్లెళ్లు అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టే ఉత్సాహంతో ఈ రోజును గడుపుతారు. రాఖీ పౌర్ణమి అంటే కుటుంబ బంధాలను బలపరిచే రక్షా బంధన్ పండుగను అక్కా చెల్లెళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.
ఈ పండుగ వచ్చిందంటే ఎంత దూరంలో ఉన్నా, అన్నదమ్ములు ఇంటికి వచ్చి తోడబుట్టిన బంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషిస్తారు. చిన్నపిల్లల్లా మారి, చెల్లెళ్లు అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టి, సుఖ సంతోషాలతో ఉండాలని ఒకరినొకరు ఆశీర్వదిస్తారు. రాఖీ కట్టిన తర్వాత అన్నదమ్ములు చెల్లెళ్లకు కానుకలు ఇస్తారు. ఈ కానుకలు డబ్బులు లేదా బహుమతులు కావచ్చు, కానీ అవి సోదర ప్రేమకు చిహ్నంగా ఉంటాయి.
రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం
రక్షా బంధన్ రోజున కొన్ని శుభ సమయాల్లో సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9న వస్తుంది. శ్రావణ నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉండటం వల్ల తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రాఖీ కట్టడానికి శుభ ఘడియలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. ఈ సమయం దాటిన తర్వాత రాఖీ కట్టకూడదని సూచిస్తున్నారు. పురాణ కథల ప్రకారం, రాక్షసి శూర్పణఖ తన అన్న రావణుడికి అశుభ సమయంలో రాఖీ కట్టడం వల్ల అతను తన సామ్రాజ్యాన్ని కోల్పోయాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
రక్షా బంధన్ పూజా విధానం
ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుకు రక్షణ దారం కట్టి అతని నుండి రక్షణ వాగ్ద్దానం పోందుతారు.
మొదటగా సోదరుడిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి.తర్వాత తిలకం దిద్ది, అక్షతలు తలపై వేయాలి.దీపం వెలిగించి సోదరుడికి హారతి ఇవ్వాలి.రాఖీని చేతికి కట్టి, మిఠాయి తినిపించాలి.
అక్క అయితే తమ్ముడిని ఆశీర్వదించాలి, చెల్లెలు అయితే అన్న నుండి ఆశీర్వాదం తీసుకోవాలి.బదులుగా సోదరుడు చెల్లెలికి బహుమతి ఇస్తాడు.ఈ విధంగా రక్షా బంధన్ పండుగ అన్నా చెల్లెళ్ల బంధాన్ని మరింత బలపరుస్తూ సంతోషం నింపే ఒక అద్భుతమైన సందర్భం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

