Gold Rate Today: జూలై 27వ తేదీ, ఆదివారం బంగారం ధరలు ఇవే..భారీగా తగ్గిన ధరలు..
Gold Rate Today: జూలై 27వ తేదీ, ఆదివారం బంగారం ధరలు ఇవే..భారీగా తగ్గిన ధరలు.. ప్రస్తుతం బంగారం ధర ఆల్-టైం గరిష్ఠ స్థాయిలో రూ. 1 లక్షకు పైగా ట్రేడ్ అవుతోంది. అయితే, నిన్నటితో పోలిస్తే నీటివారం జూలై 27, 2025న బంగారం ధర స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ రోజు ధరల వివరాలు ఇలా ఉన్నాయి: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,170, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,000, మరియు 1 కిలో వెండి ధర రూ. 1,26,000గా నమోదైంది.
బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు రోజురోజుకూ గరిష్ఠ స్థాయిలకు చేరుకుంటున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, బంగారం ధర ఇప్పటికీ లక్ష రూపాయలకు పైనే ఉంది. ఈ తగ్గుదలకు కారణం, ఇన్వెస్టర్లు తమ బంగారం పెట్టుబడులపై కొంత లాభాన్ని బుక్ చేసుకోవడమే అని గమనించవచ్చు.
అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనేక దేశాలతో వాణిజ్య యుద్ధాలకు దిగడం, సుంకాలను పెంచడం వంటివి బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదిరినప్పటికీ, స్టాక్ మార్కెట్లలో నెగెటివిటీ కొనసాగుతోంది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా బంగారంపై ఆధారపడుతున్నారు, ఫలితంగా బంగారం ధరలు గరిష్ఠ స్థాయిలకు చేరుకుంటున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధర రూ. 1 లక్షకు పైనే ట్రేడ్ అవుతోంది.
దేశీయంగా చూస్తే, శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభంలో బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల ఆభరణాల కొనుగోలుదారులకు ఆర్థిక భారం పెరిగింది. ముఖ్యంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 93,000 సమీపానికి చేరడంతో కొనుగోలుదారులకు జేబు భారం మరింతగా అనిపిస్తోంది.
ఇక వెండి ధరల విషయానికొస్తే, అవి కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వెండి ధర 30 నుంచి 40 శాతం వరకు పెరిగింది. ప్రస్తుతం 1 కిలో వెండి ధర రూ. 1.50 లక్షలుగా ఉంది. వెండి ధర పెరగడానికి ప్రధాన కారణం, పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం గణనీయంగా పెరగడం. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సోలార్ ప్యానెల్స్ వంటి వివిధ రంగాల్లో వెండి వినియోగం పెరగడంతో దాని ధరలు భారీగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

