Redmi Note 14 SE 5G :రెడ్‌మి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారా? ఈ నెల 28న కొత్త 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే మైమరిపిస్తాయి
Redmi Note 14 SE 5G :రెడ్‌మి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారా? ఈ నెల 28న కొత్త 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు చూస్తే మైమరిపిస్తాయి.. ధర ఎంత ఉండొచ్చని అనుకుంటున్నారు?
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? రెడ్‌మి ఫోన్ కోసం ఆసక్తిగా ఉంటే, ఈ ఫోన్ మీ కోసమే! రెడ్‌మి నుంచి సరికొత్త రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్ రాబోతోంది.
ఈ నెల 28న భారత మార్కెట్‌లో లాంచ్ కానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
ఈ కొత్త మోడల్ రెడ్‌మి నోట్ 14 5G సిరీస్‌లో భాగంగా వస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెడ్‌మి నోట్ 14 5G, రెడ్‌మి నోట్ 14 ప్రో 5G, రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ 5G మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ దీన్ని ‘కిల్లర్ నోట్’గా ప్రచారం చేస్తూ, సరసమైన ధరలో ఆకర్షణీయ ఫీచర్లను అందిస్తోంది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వివరాలను ఒకసారి చూద్దాం..
పెద్ద డిస్‌ప్లే: 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కూడా ఉంటుంది.
శక్తిమంతమైన పనితీరు: మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్‌తో ఈ ఫోన్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. 16GB వరకు ర్యామ్ ఉండే అవకాశం ఉంది.
అద్భుత కెమెరా: ఫోటోగ్రఫీ ప్రియులకు ట్రిపుల్ కెమెరా సెటప్! 50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో తక్కువ కాంతిలోనూ అద్భుతమైన ఫొటోలను తీస్తుంది.
పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్: 5110mAh బ్యాటరీతో టర్బోచార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. TUV SUD సర్టిఫికేట్ పొందిన ఈ బ్యాటరీ 4 ఏళ్ల వరకు మన్నికను అందిస్తుంది.
సౌండ్ క్వాలిటీ: డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో 300% వరకు వాల్యూమ్‌ను పెంచి, అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.
ధర (అంచనా): రెడ్‌మి నోట్ 14 SE 5G ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇప్పటికే అందుబాటులో ఉన్న రెడ్‌మి నోట్ 14 5G (8GB ర్యామ్, 128GB స్టోరేజ్) ధర రూ. 17,999 నుంచి ప్రారంభమవుతోంది. నోట్ 14 ప్రో 5G రూ. 23,999, నోట్ 14 ప్రో ప్లస్ 5G రూ. 29,999 వద్ద లభిస్తున్నాయి. రాబోయే రెడ్‌మి నోట్ 14 SE 5G ధర కూడా ఇవాళ్టి ధరల కంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు.

