Beauty Tips

white hair:హెన్నాలో ఈ పదార్థాలు కలిపి రాస్తే.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..

white hair:హెన్నాలో ఈ పదార్థాలు కలిపి రాస్తే.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..తెల్ల జుట్టును కప్పిపుచ్చడానికి చాలా మంది హెన్నాను ఉపయోగిస్తుంటారు. సాధారణంగా హెన్నా రాస్తే జుట్టు ఎరుపు రంగులోకి మారుతుంది. అయితే, ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.

ఈ సమస్య వచ్చిన వెంటనే చాలా మంది మార్కెట్లో దొరికే రసాయన ఉత్పత్తులను వాడతారు. కానీ, ఈ రసాయనాలు జుట్టును మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. జుట్టు దెబ్బతినకుండా, సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

హెన్నాతో పాటు కొన్ని సహజ పదార్థాలు కలిపి రాస్తే, జుట్టు ఎరుపు కాకుండా నల్లగా మారుతుంది. మీరు సాధారణంగా ఉపయోగించే హెన్నా పౌడర్‌లో మందార పూల పొడి, ఉసిరికాయ పొడి, కరివేపాకు పొడి, నిమ్మ తొక్క పొడి, నిమ్మరసం, పెరుగు కలిపితే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి, 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. నెలకు రెండు లేదా మూడు సార్లు ఈ హెన్నా మిశ్రమాన్ని ఉపయోగిస్తే, మీ జుట్టు ఎక్కువ కాలం నల్లగా, ఆరోగ్యంగా ఉంటుంది.

తయారీ విధానం:
100 గ్రాముల హెన్నా పౌడర్
1 చెంచా మందార పూల పొడి
1 చెంచా ఎండిన ఉసిరికాయ పొడి
1 చెంచా కరివేపాకు పొడి
1 చెంచా నిమ్మ తొక్క పొడి
1 చెంచా మునగ నూనె
4 చుక్కల యూకలిప్టస్ ఆయిల్
సగం నిమ్మకాయ రసం
3 చెంచాల పెరుగు
ఈ పదార్థాలను కలిపి, కొద్దిగా నీరు జోడించి చిక్కటి పేస్ట్ తయారు చేయండి. ఈ మిశ్రమం జుట్టుకు రంగు వేయకూడదనుకునే వారికి ఎంతో ఉపయోగకరం.

అప్లికేషన్ విధానం:
తలకు నూనె రాసిన అరగంట తర్వాత, చేతి తొడుగులు ధరించి, ఈ సహజ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు బాగా అప్లై చేయండి. తెల్ల జుట్టు రాకుండా నివారించాలనుకునే వారు ఈ మిశ్రమాన్ని 1 గంట పాటు ఉంచి, తర్వాత స్నానం చేయవచ్చు. ఇప్పటికే తెల్ల జుట్టు ఉన్నవారు 3-4 గంటల పాటు ఈ మిశ్రమాన్ని జుట్టుపై ఉంచి, ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్ది రోజుల్లోనే మీ తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ