Monthly Horoscope August 2025 :ఈ 9 రాశులకు పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందా..?
Monthly Horoscope August 2025 :ఈ 9 రాశులకు పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందా.. ఆగస్టు 2025 రాశి ఫలితాలు: ఈ నెలలో కొన్ని రాశుల వారికి గజలక్ష్మీ రాజయోగం వల్ల ఆర్థికంగా అద్భుత అవకాశాలు లభిస్తాయి. కొత్త ఆస్తులు, వాహనాల కొనుగోలుకు అనుకూల సమయం. శని వక్రగతి ప్రభావం కొన్ని రాశులపై ఉన్నప్పటికీ, ఈ క్రింది పరిహారాలతో మానసిక ప్రశాంతత, ఇబ్బందుల నుండి విముక్తి పొందవచ్చు. రాశుల వారీగా ఈ మాస ఫలితాలు ఇలా ఉన్నాయి:
మేషం: ఆగస్టు మాసం మేష రాశి వారికి అత్యంత శుభప్రదం. రెండవ వారం తర్వాత పెండింగ్ పనులు పూర్తవుతాయి. మాసారంభంలో వ్యాపార లావాదేవీల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురైనా, నెలాఖరుకు మంచి అవకాశాలు అందుకుంటారు. డబ్బు ఖర్చులో జాగ్రత్త అవసరం, వృధా ఖర్చులు నివారించండి. వాయిదాల వల్ల అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సకాలంలో పనులు పూర్తి చేస్తే లాభం. భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి జోక్యాన్ని నివారించండి. పరిహారం: ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసి, హనుమాన్ చాలీసా పఠించండి.
వృషభం: శుక్రుడు, చంద్రుడి శుభ సంచారం వల్ల వ్యాపారంలో లాభం. ఆగస్టు 5 నుంచి 16 మధ్య వాహన కొనుగోలు ఆలోచనలు ఫలిస్తాయి. మేషం, కన్యా రాశుల నుండి మద్దతు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో విజయం. పరిహారం: ప్రతి శనివారం పసుపు రంగు పండు పేదవారికి దానం చేయండి. ప్రతి సోమవారం శివాలయంలో ఆవు నెయ్యితో 11 దీపాలు వెలిగించండి.
మిథునం: వ్యాపారం కొత్త దిశలో పురోగమిస్తుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులకు శుభవార్త. ఆగస్టు తొలి వారం తర్వాత విదేశీ ప్రయత్నాలు వేగవంతం. గ్రీన్ కార్డ్ ప్రయత్నాలు సఫలం. పిల్లల చదువులో పురోగతి. పరిహారం: దుర్గాదేవికి కొబ్బరికాయ, లవంగాలతో తీపి ప్రసాదం సమర్పించి ప్రదక్షిణలు చేయండి. రోజూ శ్రీ విష్ణు సహస్రనామం పఠించండి.
కర్కాటకం: కొత్త ఆలోచనలతో వ్యాపారంలో విజయం. రెండవ వారం తర్వాత గృహం, వాహన కొనుగోళ్లకు అవకాశం. ఆఫీసులో నూతన బాధ్యతలు, ప్రమోషన్. ఆగస్టు 15 తర్వాత కుటుంబంలో ఆనందం. పరిహారం: శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయండి.
సింహం: సూర్యుడి శుభ సంచారం వల్ల వ్యాపారంలో విజయం. ఉద్యోగంలో జాగ్రత్తగా మాట్లాడండి. ఆగస్టు మధ్య నుంచి సామాజిక కార్యక్రమాల్లో బిజీ. పరిహారం: తండ్రి ఆశీస్సులు తీసుకోండి. నువ్వులు దానం చేయండి. గోధుమ పాయసం సూర్యుడికి నివేదించండి.
కన్య: వ్యాపారంలో మొదటి వారం చిన్న వివాదాలు నివారించండి. ఆరోగ్యం జాగ్రత్త. పిల్లల విజయంతో సంతోషం. పరిహారం: ప్రతి బుధవారం విష్ణు దర్శనం, 4 ప్రదక్షిణలు. శ్రావణంలో సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయండి.
తుల: మొదటి వారం నుంచి వ్యాపారంలో వృద్ధి. కొత్త ఒప్పందాలు, అతిథి రాకతో ఆనందం. ఆస్తి లభిస్తుంది. పరిహారం: దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించండి.
వృశ్చికం: గురు, అంగారక గ్రహాల సంచారం శుభం. వ్యాపార విస్తరణ, ఉద్యోగ మార్పిడిలో విజయం. పరిహారం: తండ్రి ఆశీస్సులు తీసుకోండి. నవగ్రహారాధన చేయండి.
ధనుస్సు: మొదటి వారంలో వ్యాపారంలో కష్టాలు. రెండవ వారం తర్వాత రియల్ ఎస్టేట్‌లో లాభం. పరిహారం: ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. పెద్దల సలహా తీసుకోండి.
మకరం: పెట్టుబడుల నుంచి లాభం. ఆస్తి వివాదం పరిష్కారం. ఉద్యోగులు అధికారులను ఆకట్టుకుంటారు. పరిహారం: పెద్దల సలహా తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త.
కుంభం: శుభగ్రహ సంచారంతో సామాజిక గౌరవం. రాజకీయవేత్తలకు పదవులు. పరిహారం: బుధవారం విఘ్నేశ్వరుడి దర్శనం, శ్రీ సూక్తం పఠించండి. శనివారం నువ్వులు, నల్ల వస్త్రాలు దానం చేయండి.
మీనం: వ్యాపారంలో పురోగతి. రెండవ వారంలో ఉద్యోగ మార్పులు. పాత మిత్రులతో అవకాశాలు. పరిహారం: రోజూ హనుమంతుని ఆలయంలో 3 ప్రదక్షిణలు చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

