BusinessToday gold rate

Gold Rate Today: జూలై 31, గురువారం బంగారం ధరలు ఇవే.. భారీగా తగ్గుతున్న ధరలు..

Gold Rate Today: జూలై 31, గురువారం బంగారం ధరలు ఇవే.. భారీగా తగ్గుతున్న ధరలు.. జూలై 31, 2025, గురువారం నాడు బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఒక తులం (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,00,480గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,100గా పలికింది. ఒక కిలో వెండి ధర రూ. 1,27,000 వద్ద రికార్డు స్థాయిని తాకింది.

గత నెల రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు వారాల్లో బంగారం ధరలు ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిని దాటి ముందుకు సాగాయి. గత వారం నుంచి 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు పైగా ట్రేడ్ అవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలోని అస్థిర పరిస్థితులు, డాలర్ విలువ పతనం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 25% టారిఫ్ ప్రణాళికలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు, దీంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

శ్రావణమాసంలో, పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారు ఆభరణాల కొనుగోలు ఖరీదైన వ్యవహారంగా మారింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు గొలుసు కొనాలన్నా లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ధరల పెరుగుదల వినియోగదారులకు ఇబ్బందికరంగా ఉండగా, బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం లాభదాయకంగా ఉంది.

వెండి ధర కూడా రూ. 1,27,000తో సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో వెండిలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బంగారం, వెండి ధరలు ఎప్పుడు తగ్గుతాయని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ