Business

PM Kisan Samman Nidhi Yojana:పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్ చేసుకోండి…

PM Kisan Samman Nidhi Yojana:పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్ చేసుకోండి… దేశవ్యాప్తంగా రైతులకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20వ విడత (PM Kisan 20th Installment) నిధుల విడుదల తేదీని నిర్ణయించింది. ఈ సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది.

పీఎం కిసాన్ యోజన నిధులను ఆగస్టు 2, 2025న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో బనౌలి గ్రామంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొని, అక్కడి నుంచి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. దీని ద్వారా 9.7 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 20,500 కోట్లకు పైగా నిధులు జమ కానున్నాయి.

పీఎం కిసాన్ యోజన కింద 20వ విడతలో రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున జమ అవుతాయి. అయితే, ఈ యోజనలో నమోదైన రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరని కేంద్రం స్పష్టం చేసింది. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఓటీపీ ఆధారిత (మొబైల్ నంబర్) ఈ-కేవైసీ సౌకర్యం అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కోసం సమీపంలోని సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించాలని సూచించింది.

2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 19 విడతల్లో రూ. 3.69 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయబడ్డాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 20వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు రూ. 20,500 కోట్లు బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ, రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో రైతులతో అనుసంధానించాలని, పండుగలా జరుపుకోవాలని ప్రధానమంత్రి మోదీ అధికారులకు ఆదేశించారు.

పీఎం కిసాన్ నిధుల స్టేటస్‌ను ఎలా తెలుసుకోవాలి?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు జమ అయిన తర్వాత బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే, ఆన్‌లైన్‌లో కూడా నిధులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకోవచ్చు:

ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించండి.
‘స్టేటస్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
స్క్రీన్‌పై పీఎం కిసాన్ విడత స్టేటస్ కనిపిస్తుంది.
అక్కడే ఈ-కేవైసీకి సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?

పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించండి.
‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, మండలం, గ్రామం (మీ వ్యవసాయ భూమి ఉన్న గ్రామం) వివరాలను డ్రాప్‌డౌన్ మెనూ నుంచి ఎంచుకోండి.
‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.

పీఎం కిసాన్ నిధులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, హెల్ప్‌లైన్ నంబర్లు 155261 లేదా 011-24300606కు సంప్రదించవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.