Business

PM Kisan Yojana: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న 8 రకాల స్కీముల గురించి వివరంగా..

PM Kisan Yojana: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న 8 రకాల స్కీముల గురించి వివరంగా.. పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం కేవలం పీఎం కిసాన్ యోజనతోనే కాకుండా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టింది.

ఈ పథకాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఈ పథకాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 8 వ్యవసాయ పథకాల వివరాలను చూద్దాం.

ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (PM-KMY): ఈ పథకం కింద రైతులకు వృద్ధాప్యంలో పెన్షన్ అందిస్తారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల రైతులు నెలకు 55 నుంచి 2000 రూపాయలు చెల్లించాలి. 60 ఏళ్ల తర్వాత నెలకు 3000 రూపాయల పెన్షన్ అందుతుంది. ఈ పథకాన్ని ఎల్‌ఐసీ ద్వారా నిర్వహిస్తారు.

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY): ఈ స్కీం ద్వారా పంట నష్టాలకు బీమా కవరేజీ అందుతుంది. విత్తనం నాటడం నుంచి కోత వరకు జరిగే నష్టాలకు బీమా సౌకర్యం ఉంటుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయల క్లెయిమ్‌లు చెల్లించారు.

వడ్డీ సబ్సిడీ పథకం (Modified Interest Subvention Scheme – ISS): ఈ పథకం కింద రైతులకు 7% వడ్డీ రేటుతో రుణాలు అందిస్తారు, అందులో 3% వడ్డీ మాఫీ ఉంటుంది. అంటే, నికరంగా 4% వడ్డీతో రుణాలు లభిస్తాయి.

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (AIF): ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా రైతులకు 1 లక్ష కోట్ల రూపాయల వరకు రుణాలు అందిస్తున్నారు. ఇందులో 3% వడ్డీ రాయితీ కూడా ఉంటుంది.

కొత్త 10,000 రైతు ఉత్పత్తిదారుల సంఘాల స్థాపన (FPOs): ఈ పథకం ద్వారా రైతులకు 2 కోట్ల రూపాయల వరకు రుణం అందే అవకాశం ఉంది.

జాతీయ తేనెటీగల పెంపకం & తేనె మిషన్ (NBHM): తేనె ఉత్పత్తిని పెంచేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకం ప్రారంభించారు. దీని కింద హనీ టెస్టింగ్ ల్యాబ్‌లు, మినీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.

ధరల మద్దతు పథకం (PSS): ఈ పథకం ద్వారా పండించిన పంటలకు మద్దతు ధరలను నిర్ధారించి, రైతులకు ధరల నియంత్రణపై సూచనలు అందిస్తారు.

నమో డ్రోన్ దిదీ పథకం: ఈ స్కీం కింద మహిళలు మరియు మహిళా గ్రూపులకు 15,000 డ్రోన్లను 80% సబ్సిడీతో అందిస్తున్నారు. ఈ డ్రోన్లను వ్యవసాయ పనుల కోసం ఉపయోగించవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."