TTD Srivani Break Darshan:శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీ వాణి భక్తుల కోసం కీలకమైన అప్ డేట్..
TTD Srivani Break Darshan:శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీ వాణి భక్తుల కోసం కీలకమైన అప్ డేట్.. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం శ్రీవాణి టికెట్లు తీసుకున్న భక్తులు ఇకపై గంటల తరబడి క్యూ లైన్‌లో నిరీక్షించి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.
టీటీడీ అధికారులు భక్తుల సౌకర్యార్థం సుదర్శనం టోకెన్ కంకణాల తరహాలో డిజిటల్ టోకెన్లను ముంజేతికి కట్టే విధానాన్ని అమలు చేయనున్నారు. ఉదయాన్నే ఈ టోకెన్లు పొందిన భక్తులు, తమ ఇతర పనులను చూసుకుని, దర్శన సమయానికి సౌకర్యవంతంగా టికెట్లు తీసుకునే అవకాశం కల్పించనున్నారు.
శ్రీవాణి టికెట్లను భక్తులకు మరింత సులభతరం చేసేందుకు టీటీడీ ఆధునిక పద్ధతులను అనుసరిస్తోంది. రోజూ 800 ఆఫ్‌లైన్ టికెట్లను తిరుమలలో కేటాయించే విధానంలో ఇటీవల మార్పులు చేశారు. రూ.10,500 చెల్లించి ఈ టికెట్లు పొందే భక్తుల ఇబ్బందులను అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి స్వయంగా పరిశీలించి, డిజిటల్ టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టే నిర్ణయం తీసుకున్నారు.
ఈ టోకెన్లలో భక్తుల వివరాలు, సీరియల్ నంబర్‌తో సహా సిస్టమ్‌లో నమోదు చేసి పంపిణీ చేస్తారు. ఈ నూతన విధానాన్ని వచ్చే వారంలో అమలులోకి తీసుకొచ్చేందుకు అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు.
ప్రస్తుతం, తిరుమలలోని హెచ్‌వీడీసీ ప్రాంతంలో శ్రీవాణి టికెట్ల కోసం ఆధునిక కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు. గతంలో టికెట్ తీసుకున్న రోజు కాకుండా మరుసటి రోజు దర్శనం కల్పించే విధానాన్ని సవరించి, ఇప్పుడు ఉదయం టికెట్ తీసుకుంటే అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం అనుమతించేలా మార్పులు చేశారు.
శ్రీవాణి టికెట్లకు భక్తుల నుంచి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచి భక్తులు క్యూలో నిలబడుతున్నప్పటికీ, టీటీడీ ఉదయం 10 గంటలకు టికెట్ పంపిణీ ప్రారంభిస్తోంది. నాలుగు కౌంటర్లతో కూడిన కార్యాలయంలో టికెట్లు జారీ చేస్తున్నప్పటికీ, భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో 800 టికెట్లు కేటాయించిన తర్వాత మిగిలిన వారికి తిరస్కరించాల్సి వస్తోంది.
ఈ పరిస్థితిని నివారించేందు, గంటల తరబడి నిరీక్షణ లేకుండా 10 నిమిషాల్లో టికెట్లు పొంది, సౌకర్యవంతంగా దర్శనానికి వెళ్లేలా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఏర్పాట్లు చేస్తున్నారు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

