Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా..ఈ రాశి వారు జాగ్రత్త..
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా..ఈ రాశి వారు జాగ్రత్త.. మనలో చాలా మంది రాశి ఫలాలను చూసుకొని దానిని బట్టి అడుగులు వేస్తూ ఉంటారు.
మేషం
అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు సమకూరుతాయి. చంచలమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోకండి. ఇష్ట దైవ ఆరాధన శుభ ఫలితాలను అందిస్తుంది.
వృషభం
శుభవార్త వింటారు. ఆర్థిక అవసరాలకు డబ్బు అందుతుంది. బంధుమిత్రుల సహాయంతో మేలు జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శుభప్రదం.
మిథునం
పనులలో ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి వస్తుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. శివారాధన శుభకరం.
కర్కాటకం
పనులలో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహించండి. ఆత్మీయుల సహకారం మేలు చేస్తుంది. శత్రువులపట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శక్తిని ఇస్తుంది.
సింహం
మీ రంగంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. శ్రీ లక్ష్మీదేవి దర్శనం శుభ ఫలితాలను అందిస్తుంది.
కన్య
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం ఉత్తమం.
తుల
భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనులలో అడ్డంకులను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు అందుతాయి. ఇష్ట దేవతా స్తోత్ర పఠనం శుభకరం.
వృశ్చికం
పనులలో ఉత్సాహంగా ముందుకు సాగండి. ఆటంకాలను ధైర్యంగా అధిగమిస్తారు. మనోధైర్యంతో చేసే కార్యాలు కీర్తిని తెస్తాయి. ఇష్ట దేవతా స్తోత్ర పఠనం మేలు చేస్తుంది.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సౌఖ్యం కలుగుతుంది. కీలక సమయాల్లో సమయోచిత నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్థికంగా శుభ సమయం. ఇష్ట దేవత దర్శనం ఉత్తమం.
మకరం
దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తారు. కీలక విషయాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. రుణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇష్ట దేవతా ఆరాధన శుభప్రదం.
కుంభం
మీ రంగంలో శుభ ఫలితాలు అందుకుంటారు. ఆనందకరమైన సమయం గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
మీనం
మీ రంగంలో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మాట తప్పకుండా ఉండాలి. సహనంతో వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం శుభకరం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

