Gold Rate Today: ఆగస్టు 10వ తేదీ ఆదివారం బంగారం ధరలు.. సామాన్యునికి కొనటం కష్టమే..
Gold Rate Today: ఆగస్టు 10వ తేదీ ఆదివారం బంగారం ధరలు.. సామాన్యునికి కొనటం కష్టమే.. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతూ రికార్డు స్థాయిలో పరుగులు తీస్తున్నాయి. ప్రతి రోజూ కొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఆగస్టు 10, 2025, ఆదివారం నాటి బంగారం ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.
నీటి ఆగస్టు 10వ తేదీ ఆదివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,090గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 94,850గా ఉంది. అలాగే, ఒక కిలో వెండి ధర రూ. 1,17,920గా పలికింది. గత వారం రోజులుగా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి, ప్రతి రోజూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ ముందుకు సాగుతోంది. బంగారం ధర ఇప్పటికే ఆల్-టైం గరిష్ఠ స్థాయిని దాటి, కొత్త రికార్డులను సృష్టించింది.
బంగారం ధరలు ఇంతగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న నెగెటివ్ సెంటిమెంట్ ఒక ముఖ్య కారణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50%కి పైగా సుంకాలను విధిస్తూ వరుస టారిఫ్ ప్రకటనలు చేస్తున్నారు.
దీంతో అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెగెటివ్ సెంటిమెంట్ ఇన్వెస్టర్లను తమ పెట్టుబడులను బంగారంలోకి మళ్లించేలా చేస్తోంది. అదనంగా, డాలర్ విలువ భారీగా పడిపోవడం కూడా బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పవచ్చు, ఇది బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది.
అదే విధంగా, వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతూ ముందుకు సాగుతున్నాయి. వెండి ధరల పెరుగుదలకు పారిశ్రామిక రంగంలో దానికి ఉన్న డిమాండ్ ఒక ప్రధాన కారణం. వెండి డిమాండ్ పెరిగే కొద్దీ దాని ధర కూడా గణనీయంగా పెరుగుతోంది.
శ్రావణ మాసంలో బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, ఆభరణాల కొనుగోలుదారులకు ఇది షాకింగ్ వార్తగా చెప్పవచ్చు. గత ఏడాదితో పోలిస్తే, బంగారం ధర సుమారు 30% పైగా పెరిగింది. ఈ పరిస్థితిలో, బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే వారు జాగ్రత్తగా, ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

