BusinessToday gold rate

Gold Rate: ఆగస్టు 13వ తేదీ, బుధవారం బంగారం ధరలు ఇవే.. ఈ సమయంలో కొనవచ్చా..?

Gold Rate: ఆగస్టు 13వ తేదీ, బుధవారం బంగారం ధరలు ఇవే.. ఈ సమయంలో కొనవచ్చా.. బంగారం ధర నిన్నటితో పోల్చితే నీటు స్వల్పంగా పెరిగింది. ఈ రోజు పసిడి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో, అలాగే తాజా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆగస్టు 13, 2025, బుధవారం నాడు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,650, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,350, మరియు ఒక కిలో వెండి ధర రూ. 1,16,430గా ఉంది. నిన్నటితో పోల్చితే ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలు ఆల్-టైమ్ రికార్డుకు సమీపంలో ఉన్నాయి.

బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలోని అస్థిర పరిస్థితులు. ముఖ్యంగా, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల వాతావరణం వల్ల బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా బంగారంలోకి మళ్లిస్తున్నారు, దీంతో బంగారానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగి, ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

బంగారం ధరల పెరుగుదలకు మరో కీలక కారణం డాలర్ విలువ తగ్గుదల. అమెరికా మార్కెట్లో ఒక ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర 3400 డాలర్ల వద్ద ఉంది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు బంగారంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇటీవల గోల్డ్ ETF బాండ్ల సంఖ్య రికార్డు స్థాయిలో ఉందని నిపుణులు చెబుతున్నారు.బంగారం ధరల పెరుగుదలతో బంగారు ఆభరణాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.

22 క్యారెట్ల బంగారం ధర రూ. 94,000 సమీపానికి చేరుకుంది. ప్రస్తుతం శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఈ ధరలు భారంగా మారాయి. అయితే, బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే చర్చ జరుగుతోంది.

ప్రస్తుత అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు ఇలాగే కొనసాగితే, బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో, వెండి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పారిశ్రామిక డిమాండ్. ఎలక్ట్రిక్ కార్ల తయారీ, ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో వెండి భారీగా వినియోగించబడుతోంది, దీంతో దాని ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ