Devotional

Tirumala Tirupati:తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు బిగ్ అలర్ట్.. వివరాలు ఇవే…

Tirumala Tirupati:తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు బిగ్ అలర్ట్.. వివరాలు ఇవే… తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం… తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన ఆగస్టు 15, 2025 నుంచి అమలులోకి రానుంది. ఈ విధానం యొక్క వివరాలు ఇలా ఉన్నాయి…

ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించరు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో వచ్చే భక్తులకు మెరుగైన భద్రత, రద్దీ నివారణ, మరియు పారదర్శక సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 15 నుంచి తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని, ఫాస్టాగ్ లేని వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేసింది.

ఫాస్టాగ్ లేని వాహనదారుల సౌకర్యం కోసం, అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు టీటీడీ పేర్కొంది. ఈ కేంద్రంలో వాహనదారులు తక్కువ సమయంలోనే ఫాస్టాగ్‌ను పొందవచ్చు.

ఫాస్టాగ్ సౌకర్యం పొందిన తర్వాత మాత్రమే వాహనాలను తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ తెలిపింది.భక్తులు ఈ నూతన విధానాన్ని గమనించి, సహకరించాలని టీటీడీ కోరింది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ