DevotionalToday Rasi Phalalu In telugu

TODAY HOROSCOPE IN TELUGU: ఆగష్టు 15 శుక్రవారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారికీ కష్టాలు..

TODAY HOROSCOPE IN TELUGU: ఆగష్టు 15 శుక్రవారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారికీ కష్టాలు.. ఆగష్టు 15, శుక్రవారం, శ్రావణ మాసం, సప్తమి తిథి రాత్రి 11:50 వరకు, తర్వాత అష్టమి, నక్షత్రం అశ్విని ఉదయం 7:35 వరకు, తర్వాత భరణి, వర్జ్యం సాయంత్రం 4:36 నుండి 6:06 వరకు.

మేష రాశి:
ఈ రోజు గ్రహబలం పాక్షికంగా ఉంది. అనుకోని ధనలాభం సాధ్యం. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు పన్ను సంబంధిత సమస్యలు రావచ్చు, జాగ్రత్త. హోటల్ వ్యాపారంలో ఉన్నవారు ఆహార భద్రత విషయంలో శ్రద్ధ వహించండి. లక్ష్మీ నారాయణ స్వామికి పసుపు రంగు పూలతో అర్చన చేయించండి, శుభం జరుగుతుంది.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: పసుపు

వృషభ రాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. అదృష్టం కలిసివస్తుంది. ధనలాభం, వ్యాపారులకు మంచి రోజు. కొత్త పెట్టుబడులకు అనుకూలం. విద్యార్థులకు శుభకరం. గణపతి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: పసుపు

మిథున రాశి:
పనుల్లో అనుకోని అడ్డంకులు రావచ్చు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండండి, గ్రహబలం అనుకూలంగా లేదు. కొత్త పెట్టుబడులు, అప్పులు ఇవ్వడం మానండి. శత్రువులపై జాగ్రత్తగా ఉండండి. పంచముఖి హనుమంతునికి ఆకుపూజ చేయించండి, ఇబ్బందులు తొలగుతాయి.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: పసుపు

కర్కాటక రాశి:
గ్రహబలం అనుకూలం. వ్యాపారంలో లాభాలు, అనుకోని ధనప్రాప్తి. పెట్టుబడులు, స్టాక్స్ కొనుగోలుకు మంచి సమయం. పిల్లల నుండి శుభవార్తలు. జీవిత భాగస్వామికి కానుకలు, బంగారం కొనుగోలు అవకాశం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శుభం. శివాలయ దర్శనం మరింత మంచి ఫలితాలిస్తుంది.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: పసుపు

సింహ రాశి:
గ్రహబలం అద్భుతంగా ఉంది. వ్యాపారులకు బహుమార్గాల్లో లాభాలు. రియల్ ఎస్టేట్ ఒప్పందాల్లో జాగ్రత్త. పూర్వీకుల ఆస్తుల ద్వారా ధన, ఆస్తి లాభాలు. విద్యార్థులకు, స్టాక్స్ పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం. వెంకటేశ్వర స్వామికి 116 రూపాయలు పసుపు గుడ్డలో కట్టి హుండీలో వేయండి, శుభాలు కలుగుతాయి.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: పసుపు

కన్యా రాశి:
శుక్రుని శుభదృష్టి వల్ల మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు. రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వ్యాపారులకు అనుకోని లాభాలు. లక్ష్మీదేవికి యథాశక్తి పూజ చేయండి, నానబెట్టిన శనగలు ప్రసాదంగా సమర్పించండి, శుభాలు కలుగుతాయి.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: పసుపు

తులా రాశి:
గ్రహబలం అనేక విధాల అనుకూలం. విందు, వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందం. మిత్రుల వల్ల లాభం. పిల్లల వివాహ ప్రయత్నాలు సఫలం. శుభవార్తలు, ధనలాభం. విద్యార్థులకు అనుకూలం. అమ్మవారికి పసుపు పూలతో అర్చన చేయించండి, అద్భుత ఫలితాలు.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: పసుపు

వృశ్చిక రాశి:
గ్రహబలం అనుకూలంగా లేదు. పనులు నిదానంగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉంచండి. ఉద్యోగులు సహోద్యోగులతో వాగ్వివాదాలు ఆగ్రహాలకు గురికాకుండా జాగ్రత్త. పెట్టుబడుల్లో నష్టం సంభవించవచ్చు. విద్యార్థులు శ్రద్ధగా చదవండి. నవగ్రహ ప్రదక్షిణ, అమ్మవారికి కుంకుమ పూజ మంచి ఫలితాలిస్తాయి.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: పసుపు

ధనూ రాశి:
గ్రహబలం అనుకూలం. పాత జ్ఞాపకం ఇబ్బంది పెట్టినా, సులభంగా బయటపడతారు. కొత్త పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వారికి లాభాలు. దత్తాత్రేయ ఆరాధన గొప్ప శుభాలనిస్తుంది.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: పసుపు

మకర రాశి:
గ్రహబలం పాక్షికం. పనుల్లో జాప్యం సంభవించవచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్త, వెన్నుపోటు ఆశంక. రియల్ ఎస్టేట్ వారికి లాభం. సంతకాల విషయంలో శ్రద్ధ వహించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పూలు, కొబ్బరికాయ సమర్పించండి, ఇబ్బందులు తొలగుతాయి.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: పసుపు

కుంభ రాశి:
శని వక్ర దృష్టి ప్రభావం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టండి. వ్యాపారులకు శ్రమ ఎక్కువ, లాభం తక్కువ. శివారాధన మేలు చేస్తుంది.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: పసుపు

మీన రాశి:
అనుకోని ఇబ్బందులు రావచ్చు. గ్రహబలం పాక్షికంగా అనుకూలం. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. రియల్ ఎస్టేట్ వారు కొనుగోలు, అమ్మకాల్లో జాగ్రత్త. వ్యాపారులకు శ్రమ ఎక్కువ. రోజు మధ్యలో కొంచం అనుకూలంగా మారవచ్చు. శివారాధన మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
లక్కీ నెంబర్: 9
లక్కీ కలర్: పసుపు

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ